తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడింది. ఎల్లుండి అంటే మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో… ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ క్రమంలో ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండనుంది.

ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల పై కీలక వ్యాఖ్యలు చేయమన్నారు. అలాగే… గులాబీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఇక హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కెసిఆర్ ఇవ్వాలా కీలక వ్యాఖ్యలు చేస్తారు.