ఈ ఫుడ్‌ పెడితే.. మీ పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది!

కరోనా నేపథ్యంలో మీ పిల్లలకు ఇమ్యూనిటీ పెరిగే ఆహారాన్ని అందించడం వల్ల వాళల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో వారికి బలవర్థకమైన ఆహారాన్ని అందించాలి. అయితే, చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్‌ ఏంటో తెలుసుకుందాం. పెద్దవారిలా పిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూల్య ఆహారాన్ని ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.

గుడ్లు

గుడ్లలో సంపూర్ణ పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్‌ డీ, ఈ, జింక్‌. సెలినీయం వంటి పోషకాలు ఉంటాయి. గుడ్లు పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. శిశువుల్లో శక్తిని అందించి వారికి రక్షణ కల్పిస్తుంది.

చేపలు

చేపల్లో ఓమేగా ఫ్యాటీ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా సాల్మన్‌ చేప పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది.

బాదం

విటమిన్‌–ఈ, అధికంగా ఉంగే బాదం రోజూ ఉదయాన్నే కొన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని పిల్లలకు స్నాక్స్‌ రూపంలో అందిస్తే మంచిది.

పెరుగు

మంచి చేకూర్చే ఆహారం పెరుగు. ఇది పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంపొందించేందుకు సాయపడుతుంది. వేడిని కూడా తగ్గిస్తుంది. చక్కెర లేకుండా పెరుగును పిల్లలకు తినిపించేలా జాగ్రత్త పడండి. .

బెర్రీస్‌

బెర్రీస్‌ బ్యాక్టిరియా నుంచి రక్షణనిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు సులభంగా జీర్ణమయ్యే ఈ ఆహారం మంచి డైట్‌ గాను ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడి తింటారు.

ఓట్స్‌

ఓట్స్‌ లో ఫైబర్‌ ఉంటుంది. వీటివల్ల చిన్న పిల్లలకు త్వరగా జీర్ణం కావడంతో పాటు రోగకారక క్రిములను నిరోధించడంలో ఓట్‌ మీల్‌ సహాయపడుతుంది.