చూయింగ్ గమ్ నుండి ఆల్కహాల్ వరకు ఖాళీ కడుపుతో తీసుకోకూడని ఆహారాలు.. కారణాలు

పొద్దున్న పూట మీరు తీసుకునే ఆహారాలే మీ రోజుని నిర్ణయిస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే కొన్ని ప్రత్యేక ఆహారాలను ఖాళీ కడుపుతో తినడానికి ఇష్టపడరు. అవి తినడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో ఆ ఆహారాలను తీసుకోకూడని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాల గురించి తెలుసుకుందాం.

 

కాఫీ

పొద్దున్న లేవగానే కాఫీ నోట్లోకి దిగందే చాలామందికి రోజు తెల్లవారదు. కానీ కాఫీ అస్సలు మంచిది కాదు. దానిలోని కెఫైన్ అసిడిటీని ప్రేరేపిస్తుంది. అందువల్ల ఖాళీ కడుపుతో కాఫీ కరెక్ట్ కాదు.

ఆల్కహాల్

ఖాళీ కడూపుతో తీసుకునే ఆల్కహాల్ డైరెక్టుగా రక్తంలోకి వెళుతుంది. రక్తప్రవాహంలో ఆల్కహాల్ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. దీనివల్ల పల్స్ రేట్ పడిపోవడం జరుగుతుంది. అంతేకాదు ఖాళీ కడూపుతో తీసుకునే ఆల్కహాల్ శరీరంలోని అనేక భాగాల్లోకి చేరుతుంది.

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్ కారణంగా జీర్ణక్రియకు ఉపయోగపడే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఈ ఆమ్లం, జీర్ణాశయ గోడల్లో పేరుకుపోయి జీర్ణాశయ పూతకు కారణం అవుతుంది.

ఖాళీ కడూపుతో చేయకూడని పనులు

షాపింగ్

ఖాళీ కడూపుతో షాపింగ్ కి వెళ్ళేవారు అవసరమైన దానికంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు. అంతేకాదు వారు తీసుకునే పదార్థాల్లో కేలరీలు ఎక్కువగా ఉన్నవాటిని కొంటారని కార్నెల్ యూనివర్సిటీ వెల్లడి చేసింది.