ఎలాగూ ఇంట్లోనే గా.. మీ ఆవిడతో కలిసి మొక్కజొన్న గారెలు చేసేయండిలా..!

-

ఈ మధ్యకాలంలో పిల్లలు ,పెద్దలు అందరూ కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. అందుకే మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహారం లో మొక్కజొన్న ఒకటి. దీనిలో అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్న గారెలు తయారీకి కావలసిన పదార్థాలు:- లేత మొక్కజొన్న గింజలు, డీప్ ఫ్రై సరిపడా నూనె, రెండు ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర.

తయారీ విధానం:- లేత మొక్కజొన్న గింజల్ని రెండు గంటలు నాన పెట్టాలి. తరువాత నానిన మొక్క జొన్న గింజల్ని, అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి. ఆ మిశ్రమానికి సరిపడా ఉప్పు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. స్టౌ వెలిగించి కళాయి పెట్టి ఫ్రై కి సరిపడా నూనె పోయాలి. నూనె కాగాక పిండిని గారెలుగా వత్తుకుని నూనెలో వేయాలి. వీటిని బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. అంతే వేడివేడి మొక్కజొన్న గారెలు రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news