ఈ పోలీసోడిని చూసి బుద్ధి తెచ్చుకోండి .. చేతులెత్తి దండం పెట్టినా తప్పులేదు !

-

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ అరికట్టడానికి లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ప్రజలను కట్టడి చేయడానికి పోలీసులను రంగంలోకి దింపి, ప్రజలు ఇల్లు దాటి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పోలీసులు అత్యుత్సాహం చూపుతూ దేశ ప్రజలను ఉగ్రవాదుల మాదిరిగా భయంకరంగా లాఠీలతో గొడ్డును బాదినట్టు కొడుతున్నారు. ఆడవాళ్లు మరియు ముసలి వాళ్లు అనే తేడా లేకుండా భయంకరంగా కొడుతున్నారు. దీంతో ఆయా ప్రభుత్వాల పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అవసరాల మేరకు వస్తున్న సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై తీవ్ర స్థాయిలో పబ్లిక్ నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.AP Police Constable Examination 2019: Final result declared at ...ఇటువంటి తరుణంలో త్రిపుర క్యాడర్ కి సంబంధించిన ఐపీఎస్ అధికారి ఇటీవల డిప్యుటేష‌న్‌పై జగన్ సర్కార్ తిరుపతి అర్బన్ ఎస్పీగా పోస్ట్ ఇవ్వటం జరిగింది. మామూలుగా అయితే పోలీసులు ఎక్కువగా తమ దగ్గరికి వచ్చిన వాళ్ల దగ్గర నుండి డబ్బులు లాక్కోవాలని చూస్తుంటారని అందరి మైండ్ లో ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తిరుపతిలో మానవత్వంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైరస్ నేపథ్యంలో తన జీవితం మొత్తం కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు విరాళంగా ఇచ్చి నిజమైన పోలీస్ అనిపించుకున్నాడు.

 

ఈ సందర్భంగా తనకు వచ్చే నెల జీతం లక్ష రూపాయలో సీఎం స‌హాయ నిధికి రూ.50 వేల చెక్‌ను తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గిరీష్‌కు, అలాగే మ‌రో రూ.50 వేలను లాక్‌డౌన్ కార‌ణంగా నిరాశ్ర‌యులైన అభాగ్యుల‌కు, అనాథ‌ల‌కు తిండితీర్థాలు అందించాల‌ని కోరుతూ తిరుప‌తి ఆర్డీఓ ద్వారా ‘అమ్మ ఒడి’ ట్ర‌స్ట్‌కు ర‌మేష్‌రెడ్డి అంద‌జేశాడు. దీంతో తిరుపతి వాసులు రమేష్ రెడ్డి చేసిన పనికి చేతులెత్తి దండం పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త రావడంతో ఈ రమేష్ రెడ్డి అనే పోలీసోడిని చూసి మిగతా పోలీసులు బుద్ధి తెచ్చుకోండి అంటూ కామెంట్ పెడుతున్నారు. బయటకు జనాలు వస్తే  అవసరాల కోసమే, వైరస్ ఎక్కించుకోవటం కోసం కాదు, మీతో కొట్టించుకోవడం కోసం అంతకంటే కాదు.. కాస్త మనుషుల్లాగా ప్రవర్తించండి పోలీసులు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news