మహమ్మారి వచ్చినప్పటి నుండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగింది. ఆహార అలవాట్లు, తినే ఆహారాలు చాలా మారాయి. ఏది తింటే ఏం జరుగుతుంది అన్న విషయాలు అందరికీ తెలిసాయి. ఇలాంటి టైమ్ లో ఐరన్ అధికంగా ఉన్న ఆహారాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రక్తంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అందువల్ల ఇలాంటి ఇబ్బందుల నుండి దూరం ఉండాలంటే ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి.
పాలకూర
పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు పాలకూరలో 6గ్రాముల ఐరన్ తో పాటు ప్రోటీన్, విటమిన్ ఈ, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.
సోయాబీన్
ఒక కప్పు సోయాబీన్లలో 8.8గ్రాముల ఐరన్ ఉంటుంది. అంతే కాదు సోయాబీన్లలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. మీ డైట్ లో సోయాబీన్స్ ఉండేలా చూసుకోండి.
శనగలు
డైట్ లో అధికంగా ఉపయోగించే శనగల్లో ఐరన్ పాళ్ళు చాలా ఎక్కువ. ఈ శనగలతో రకరకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా తయారు చేసుకుని రోజువారి డైట్ లో శనగలు ఉండేలా చూసుకోండి.
గింజలు
ఒక ఔన్సు గింజల్లో 1.16మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. సలాడ్లలో వీటిని భాగం చేసుకుంటే చాలా మంచిది. పైన్ నట్స్, కాజు, హాజెల్ నట్స్ బాగా పనిచేస్తాయి.
కాయ ధాన్యాలు
వంద గ్రాముల వండిన కాయ ధాన్యాల్లో 3మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటుంది.
ఈ ఆహారాలను మీ రోజువారి డైట్ లో భాగం చేసుకున్నారంటే రక్తంలో ఐరన్ లోపం తగ్గుతుంది. అంతేకాదు శరీరానికి మంచి పోషణ అందుతుంది.