అంతర్జాతీయ యోగా దినోత్సవం: కరోనా మహమ్మారి సమయంలో యోగా ప్రాముఖ్యత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

-

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి చర్చకు తీసుకు
వచ్చారు. యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో చర్చల అనంతరం ఇండియా అంబాసిడర్ అశోక్ కుమార్ ముఖర్జీ ప్రతిపాదించిన ప్రకారం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

యోగా అనే పదం సంస్కృతంలోని యోగ్ అన్న పదం నుండి వచ్చింది. దీని అర్థం సమూహం, ఐకమత్యం కావడం. ప్రస్తుతం ప్రపంచమంతా మహమ్మారి భయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా డే ని ఎవరి ఇంట్లో వాళ్ళే జరుపుకోవాలని, ఇంట్లోనే యోగా ఇంకా కుటుంబంతో యోగా అనే నినాదాన్ని ఇచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తల నడుమ ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేయాలని పిలుపిచ్చారు.

మహమ్మారి సమయంలో యోగా ప్రాముఖ్యత గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. శ్వాస సంబంధమైన ఇబ్బందులను తీసుకువచ్చే మహమ్మారి గురించి ఆందోళన చెందకుండా ఉండడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాదు కోవిడ్ నుండి రికవరీ అయ్యాక వచ్చే ఇబ్బందులను దూరం చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. కరోనా కారణంగా వచ్చే మానసిక ఇబ్బందులను సైతం తట్టుకుని బలంగా తయారవ్వడానికి యోగా మేలు చేస్తుంది.

అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నుండి చాలా మంది యోగా చేయమని సలహాలు ఇస్తున్నారు. మహమ్మారి సమయంలో మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి యోగా చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నుండి చిన్న చిన్న ఆసనాలని ప్రాక్టీస్ చేయండి అని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news