కోడిగుడ్డు టమాటా నూడిల్స్‌

-

ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో అందరికీ తెలుసు. ఇది ఆరోగ్యాన్ని పెంచడమే కాదు చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. కోడిగుడ్డు మంచిది కాదా అని రోజూ ఉడకబెట్టింది తినాలంటే బోరు కొడుతుంది. ఆమ్లెట్‌ వేసుకొని తింటే ఫ్యాట్‌ మారే అవకాశం ఉంది. సాయంత్రం పూట స్నాక్స్‌గా తినే నూడిల్స్‌లో కోడిగుడ్డు కలుపుకుంటే డిఫ్రెంట్‌ టేస్ట్‌తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి టమాటాను కూడా జోడిస్తే విటమిన్‌ ఇ,డి కూడా వచ్చి చేరుతాయి. మరి ఎగ్‌టమాటా న్యూడిల్స్‌ తయారీ ఎలాగో చూద్దాం..

కావాల్సినవి :

పచ్చిగుడ్డు : 4
ఉల్లిగడ్డలు :10
నూనె : 10 గ్రా.
నూడిల్స్‌ : 1 కే.జి
జీలకర్ర : రెండు టీస్పూన్లు
నీరు : 2 లీ.
కారం : 2 టీస్పూన్లు
టమాటాలు : 6
టమాటా సాస్‌ : 4 టీస్పూన్లు

తయారీ :

రెండు లీటర్ల నీటిలో టమాటా సాస్‌ నాలుగు స్పూన్లు వేసి దానికి సరిపడా ఉప్పు, న్యూడిల్స్‌ వేసి ముప్పాతిక భాగం ఉడికించాలి. అవి ఉడుకుతున్నప్పుడు దానిలో పచ్చిమిర్చి-అల్లం ముక్కలు వేయాలి. ఉడికిన తర్వాత వార్చేయాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేడి చేయాలి. అందులో టమాటా ముక్కలు, రెండు స్పూన్లు కారం వేసి వేయించాలి. టమాటాలు ఉడుకుతూ ఉండగా అందులో రెండు పచ్చిగుడ్లు కొట్టి వేయాలి. అంతకుముందు ఉడికించిన నూడిల్స్‌ను ముక్కలుగా కోసుకున్న ఉడికిన గుడ్లను దానిలో వేసి పది నిమిషాలు మూతపెట్టి ఆ తర్వాత దించేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news