జాతీయ పోషకాహార వారోత్సవం: బిడ్డకు జన్మనిచ్చాక అలవర్చుకోవాల్సిన ఆరోగ్యకర ఆహార అలవాట్లు

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లులు తీసుకునే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఏ అలవాట్లు అలవర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అన్న అంశాలు చర్చిద్దాం.

women-food
women-food

ఈ అంశాలు ఇటు పాలిచ్చే తల్లులతో పాటు పాలివ్వని తల్లులుకు కూడా వర్తిస్తాయి.

రెగ్యులర్ మీల్స్

సమయానుసారంగా భోజనం చేయాలి. క్రమం తప్పిన వేళల్లో భోజనం చేయడం వల్ల కెలోరీ లోపం కలుగుతుంది. పాలిచ్చే తల్లులకు రోజుకి 2100 కిలోకేలరీలు కావాలి. పాలివ్వని తల్లుల కంటే ఇది 400కిలో కేలరీల ఎక్కువ.

బ్యాలన్స్ డైట్

భోజనం ప్లేటు వివిధ రకాల ఆహారాలతో నిండి ఉండాలి. ఆకు కూరలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సరైన నిష్పత్తిలో ఉండాలి. దీనివల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతే కాదు బిడ్డలు చురుగ్గా ఉంటారు. ఇంకా, బ్రౌన్ రైస్, పాస్తా, చపాతీ మొదలగునవి తల్లులకి చాలా అవసరం.

ఒకవేళ శాఖాహారులైతే,

శాఖాహారం మాత్రమే తినేవారైతే విటమిన్ బీ12, విటమిన్ బి, ఒమెగా కొవ్వు ఆమ్లాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి.

పాల ఉత్పత్తిని పెంచే ఆహారాలు

కొన్ని ఆహార పదార్థాలు పాల ఉత్పత్తిని పెంచుతాయి. వాటిల్లో మెంతులు, వెల్లుల్లి ముఖ్యమైనవి.

పాలు, పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఉంటుంది. అది తల్లులకు చాలా అవసరం. అలాగే, కావాల్సినన్ని నీళ్ళు తాగడం చాలా ముఖ్యం. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి, విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకే రోజుకి 6నుండి 8గ్లాసుల నీళ్ళు తాగాలి.