బాదం మీగడ పాయసం

భారతీయ వంటకాల్లో అత్యంత ప్రీతికరమైన వంటకాల్లో పరమాన్నం కన్నా రుచిగా ఏముంటుంది. పాయసం, పరమాన్నం ప్రతి పండుగకి తప్పనిసరి వంటకంగా మారిపోయింది. అందుకని ఈ పండుగ సమయంలో మనం బాదం మీగడ పాయసాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సినవి :

చక్కెర : 1 టేబుల్‌స్పూన్
పొట్టు తీసేసిన బాదం : 2 టీస్పూన్లు
బాస్మతి బియ్యం : 2 టీస్పూన్లు
ఆకుపచ్చని ఏలకుల పొడి : 1 టీస్పూన్
కుంకుమపువ్వు : కొన్ని రేకులు
పాలు : 350 గ్రా.
గట్టిపడిన పాలు : 4 టీస్పూన్లు

తయారీ :

బియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టాలి. కడాయిలో పాలు పోసి పది నిమిషాలపాటు మరగనివ్వాలి. నానిన బియ్యాన్ని అందులో పోసి బాగా కలుపాలి. అన్నాన్ని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. అన్నం మెత్తగా ఉన్నప్పుడు గట్టిపడిన పాలను అందులో పోయాలి. ఉడికేంతవరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే మాడుతుంది. బాదంపప్పు, ఆకుపచ్చని ఏలకులపొడి, చక్కెర దానిలో వేయాలి. దీన్ని మూడు నిమిషాల పాటు కలుపుతూ దించేయాలి. వడ్డించే ముందు కుంకుమపువ్వుతో అలంకరించుకుంటే టేస్టీగా ఉంటుంది.