రక్తంలో హీమోగ్లోబిన్ ను పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల తయారీలు.. 

-

రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది రక్తహీనత కారణంగా ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాలు ఎర్రగా ఉండడానికి కారణమయ్యే హీమోగ్లోబిన్, ఊపిరితిత్తుల నుండి శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అలాగే, శరీర అవయవాల నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను ఊపిరితిత్తులకు అందజేస్తుంది. అందువల్ల హీమోగ్లోబిన్ ని తగ్గకుండా చూసుకోవాలి.

హీమోగ్లోబిన్ లో ఐరన్ ప్రధాన మూలకం. ఐరన్ లోపం వల్ల కూడా హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అనే సమస్య ఏర్పడుతుంది.

హీమోగ్లోబిన్ స్థాయిలు ఎవరిలో ఎలా ఉండాలంటే?

పెద్దలైన పురుషుల్లో 14 to 18 gm/dL
పెద్దలైన మహిళల్లో 12 to 16 gm/dL

హోమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలు

ప్రధాన కారణం రక్తహీనత. ఇతర కారణాల్లో రక్తం నష్టపోవడం, ఆర్షమొలలు, రుతుక్రమంలో ఎక్కువ రక్తం పోవడం మొదలగు కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం కూడా ఒక కారణమే. ఎముక మూలుగ పాడైపోవడం వల్ల హీమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

మరి హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఏం చేయాలి?

దీనికోసం మునగకాయలతో తయారు చేసే ఒక రెసిపీ బాగా పనిచేస్తుంది.

దీని తయారీకి కావాల్సిన పదార్థాలు

అరకప్పు- మునగ ఆకులు
అర చెంచా నెయ్యి
3-ఉల్లిగడ్డలు
రాతి ఉప్పు

పద్దతి

నెయ్యిని వేడిచేసి అందులో తరిగిన ఉల్లిపాయలను వేయించాలి. ఆ తర్వాత మునగ ఆకులను అందులో వేసి రాతి ఉప్పును కలపాలి. ఈ పదార్థాలన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి మీద నుండి తీసివేయాలి.

ఎండుద్రాక్ష, ఖర్జూరం

10ఎండు ద్రాక్ష, 5ఖర్జూరం తీసుకుని ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నానబెట్టిన వాటిని బాగా పిసకాలి. అప్పుడు వచ్చిన ఆ ద్రావణాన్ని సేవించాలి.

Read more RELATED
Recommended to you

Latest news