వర్షాకాలం అలసటగా అనిపిస్తుందా? మీ ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకోండి.

ఒక పక్క వర్షం, మరో పక్క పని.. రెండింటి మధ్య చిరాకు ఎక్కువై ఒక్కోసారి కోపానికి దారి తీయవచ్చు. అలాగే ఏ పనిచేసినా అలసిపోయినట్లుగా అనిపించవచ్చు. అలాంటప్పుడు మీ శరీరంలో ఏదో తక్కువైందని గ్రహించాలి. వర్షాకాలంలో ఫ్రై చేసిన ఆహారాలకు అలవాటు పడ్డ మీరు, శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నారా? రక్తంలో ఐరన్ తక్కువ కావడం వల్ల బలహీనంగ్గా, అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి మీ ఆహారంలో ఈ పదార్థాలు భాగం చేసుకుంటే సరిపోతుంది.

Spinach
Spinach

ఆకుకూరలు

వర్షాకాలంలో పాలకూరని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ఇందులో కావాల్సినంత ఐరన్ ఉంటుంది. అదే కాదు బ్రోకలీ కూడా ఆరోగ్యానికి మేలు చేసి, కొత్త శక్తిని అందిస్తుంది.

గింజలు, డ్రై ఫ్రూట్స్

కాజు, బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష, ఖర్జూరం మొదలగునవి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు. వీటిని ఏ రుతువులోనైనా ఆహారంగా తీసుకోవచ్చు.

పప్పులు

పప్పులు తినడానికి చాలామంది బద్దకిస్తారు. కానీ మీరలా చేయకండి. అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సోయాబీన్ కూడా మీరు ప్రయత్నించవచ్చు. దాన్లోనూ మంచి పోషకాలు దాగున్నాయి.

విత్తనాలు

గుమ్మడి విత్తనాలు, అవిసెలు, సూర్యపువ్వు విత్తనాలను సాయంకాలం పూట స్నాక్స్ లాగా తినండి. బాగుంటుంది.

చికెన్

చికెన్లో ఐరన్ శాతం ఎక్కువే ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని ఇష్టపడేవారు చికెన్, చేపలను అస్సలు మిస్సవ్వద్దు. చేపల్లోనూ ఐరన్ పాళ్ళు ఎక్కువే. ముఖ్యంగా, షెల్ చేపలు, పీతల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్

చాక్లెట్ ఎంత డార్క్ గా ఉంటే అన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిస్ చేసుకోవద్దు.