టీపీసీసీ కొత్త టీంపై గులాబీ బాస్ ఫోకస్.. కీలక నేతే టార్గెట్‌గా వ్యూహాలు!

-

హైదరాబాద్: టీపీసీసీ‌కి కొత్త కెప్టెన్ వచ్చారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. రేవంత్ దూకుడు‌తో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఘాటు విమర్శలతో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. అటు ఆందోళనలతో పార్టీని ఉరుకుటు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ఎండగడుతున్నారు. అందరి ఫోకస్‌ను తనవైపుకు తిప్పుకుంటున్నారు. బీజేపీ వైపు చూసిన తటస్తులు, ప్రభుత్వ వ్యతిరేకులు .. కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు. దీంతో నిన్నా మొన్నటి వరకు పొలిటికల్ స్క్రీన్ మీద దూసుకుపోయిన బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్‌ను గేమ్‌లోకి తెచ్చారు. రేవంత్ ఎంట్రీ తర్వా త పొలిటికల్ సీన్‌ను టీ ఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మార్చుకుననారు. దీంతో టీపీసీసీ కొత్త టీంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు.

revanth-reddy-cm-kcrటీపీసీసీకి కొత్త కార్యవర్గం రావడంతో కాంగ్రెస్‌కు పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ప్రజల్లో చేతి పా‌ర్టీ‌పై కొంత అనుకూల చర్చ కొనసాగుతోంది. ఈ దూకుడుకు ఆదిలోనే కల్లెం వేయాలని టీఆర్ఎస్ బాస్ తెలుస్తోంది. కాంగ్రెస్ కొత్త టీంలో దూకుడు మీదున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి ఇలాకాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. వారిని బలహీన పర్చి డిఫెన్సులో పడేసే ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. టీపీసీసీ న్యూ టీంలోని బలమైన నేతల అనుచరులు, వారి నియో జక వర్గాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కారు ఎక్కించే వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేయాలని యోచిస్తున్నారు . కాంగ్రెస్ నేతలను పార్టీ కోసం కాకుండా నియో జక వర్గానికే పరిమితం చేయొచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ న్యూ చీఫ్ రేవంత్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోని స్థానిక ప్రజా ప్రతి నిధులను లాగేసే పనిలో ఉన్నారట.

 

టిఆర్ఎస్ ప్రయోగించిన అంగబలం, అర్థబలాన్ని ఎదుర్కొని మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత తన పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ గట్టిగా పని చేస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో మల్కాజి గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కొంత మెరుగైన ఫలితాలే సాధించింది.ఐతే ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వడంతో ఆయన నియోజక వర్గంలో ఆపరేష‌న్ ఆకర్ష్ ను గులాబీ పార్టీ సవాల్‌గా తీసుకుంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ నియోజక వర్గ పరిధిలోని.. నలుగురు కార్పొరేటర్లు, నలుగురు కౌన్సిలర్లు.. మరో నలుగురు ఎంపిటిసిలను టీఆర్‌ఎస్‌లోకి లాగేసుకున్నారు. గత అసెం బ్లీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్‌గా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తే..కొడంగల్‌లో స్థానిక నేతలను లాగేసి రేవంత్‌ను ఓడించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ ఆపరేష న్ ఆకర్ష్‌తో ఆత్మస్తైర్యం దెబ్బతీయొచ్చని.. అసెంబ్లీ ఎన్నికల నాటి ఫార్ములానే టీఆర్ఎస్ అప్లై చేస్తున్నారు.

కొత్త టీంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపి స్తోన్న మరో నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామంటూ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా రాష్ట్ర సమస్యల ను ఫోకస్ చేస్తూ ప్రభుత్వా న్ని జగ్గారెడ్డి విమర్శిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో జగ్గారెడ్డిని దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సన్నిహితులను వరుసబెట్టి టిఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత.. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలను టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు.

 

మరోవైపు అధికార పార్టీకి రివర్స్ లో షాకిచ్చే వ్యూహాలకు రేవంత్ పదును పెట్టారు. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు, ఉద్యమకారులను హస్తంపార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news