పప్పు ధాన్యాలని ఏ విధంగా తినాలో తెలియకపోతే దాని వల్ల వచ్చే లాభాలని కోల్పోతారు..

-

పప్పు ధాన్యాలని ఆహారంగా తీసుకోవడానికి చాలా మంది సుముఖత చూపించరు. వాటివల్ల మలబద్దకం, గ్యాస్, ఉబ్బడం లాంటి సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు. కొంతవరకు అది నిజమే అయినా, పూర్తిగా పప్పుధాన్యాలని పక్కకి పెట్టేయడం అంత సరైన పని కాదు. పప్పు ధాన్యాల్లో మాంసకృత్తులు ఉంటాయి, ముఖ్యంగా కందిపప్పులో ఈ మాంసకృత్తుల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే మాంసం తినని వారిని కూడా కందిపప్పుని తినాలని చెబుతుంటారు.

అయితే పప్పు ధాన్యాలని ఎలా తినాలనే విషయం చాలా మందికి తెలియదు. మనకు తెలియని ముఖ్య విశేషం ఏమిటంటే, పప్పులని కూరలుగా చేసుకోవడమే. కానీ అదొక్కటే కాదు పప్పులని చాలా రకాల ఆహారాలుగా చాలా విధాలుగా చేయవచ్చు. అవేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

నానబెట్టి నానమెట్టి మొలకలెత్తిన పప్పు ధాన్యాలని ఆహారంగా తీసుకోవాలి. మరొక్క విషయం ఏమిటంటే పప్పు ధాన్యాలని ధాన్యాలని సరైన మోతాదులో కలపాలి. పప్పు ధాన్యాలు 1శాతం ఉంటే మామూలు ధాన్యాలు 3శాతం ఉండాలి. అలాగే చిరు ధాన్యాల విషయానికి వచ్చేసరికి (1:2)నిష్పత్తిలో ఉండాలి. ప్రతీ నెలలో కనీసం ఐదు సార్లయినా పప్పు ధాన్యాలని కూరగాయలుగా వండుకోవాలి.

పప్పు ధాన్యాలని ఆహారంలో భాగంగా ఎందుకు చేసుకోవాలంటే,

వయస్సు పెరగడాన్ని నిరోధిస్తుంది. దానర్థం ఉన్న వయసు కంటే తక్కువ వయసు గల వారిగా కనిపించేలా చేస్తాయి. జుట్టు తెల్లబడడం, గడ్డం తెల్లబడడం వంటి సమస్యలు రాకుండా ఉంటుంది.

ఎముకల మధ్య బలాన్ని పెంచుతుంది. ఎముకలకి వాటికి కావాల్సిన పోషకాలని అందించి అవి దృఢంగా మారడానికి సాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మన శరీరంపై అనేక సూక్ష్మ జీవులు దాడి చేస్తుంటాయి. ఆ దాడిని తట్టుకుని నిలబడే ప్రతిరక్షకాలని తయారు చేసి మన ఆరోగ్యాన్ని ఉన్నతంగా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news