పుదీనాతో చాలామంది.. చట్నీలు చేసుకుంటారు. బిర్యానీ, పులావుల్లో వాడతారు. అంతకుమంచి పుదీనాతో పెద్దగా ఉపయోగం ఉండదు అనుకుంటారు.. కానీ పుదీనాతో నమ్కీలు చేసుకోవచ్చు తెలుసా..ఇలా పుదీనాను వాడుకుంటే.. ఆరోగ్యాన్ని ఎంతో మంచిది. పుదీనాలో ఫోలిక్ యాసిడ్ ఎక్కవ ఉంటుంది. ఇది కొత్తకణాల నిర్మాణానికి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం పుదీనా నమ్ కిన్ ఎలా చేసుకోవాలో చూద్దామా..!
పుదీనా నమ్ కిన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
పుదీనా ఒక కప్పు
శనగపిండి అరకప్పు
పుట్నాల పప్పు పిండి అరకప్పు
పెరుగు రెండు చెంచాలు
లెమన్ జ్యూస్ ఒక చెంచా
వాము ఒక టీ స్పూన్
జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయ ముక్కా చెక్కాగా గ్రైండ్ చేసినవి ఒక స్పూన్
పసుపు కొద్దిగా
తయారు చేసే విధానం.
మిక్సీజార్ లో పుదీనా, కొద్దిగా లెమన్ జ్యూస్, పెరుగు వేసి గ్రైండ్ చేయండి. ఆ పేస్ట్ ను పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పుట్నాలపప్పు పొడి, వాము, ఎండుమిరపకాయ పొడి, జీలకర్ర పొడి, పసుపు, పుదీనా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోండి. ఉండలుగా చేసుకుని.. చపాతీలు చేసుకున్నట్లు చేసి.. దాన్ని బాటిల్ మూత సైజు ఉన్నది తీసుకుని రౌండ్ గా కట్ చేసుకోండి. వాటికి ఫోక్ సాయంతో చిన్న హోల్స్ పెట్టండి. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా కాల్తాయి..నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్లో పేమ్ లో మెల్లగా నమ్కిన్స్ ను కాలనివ్వండి. రెండువైపులా కాలనివ్వండి. క్లాత్ తో ప్రస్ చేస్తే లోపల అంతా కాలతాయి. టమోటా సాస్ తో తింటే.. ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఆరోగ్యకరమైన నమ్కిన్స్ మీరు ఓ సారి ట్రై చేయండి. వీటిని చేయడానికి కూడా పెద్దగా ఐటమ్స్ అవసరం లేదు.. టైం కూడా తక్కువే. ఈవినింగ్ టైమ్స్ లో చేసుకుని హ్యాపీగా తినేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి పెడితే.. ఇష్టంగా తినేస్తారు.
-Triveni Buskarowthu