పిల్లలకు తెగ నచ్చే “నాటుకోడి శాండ్ విచ్”

-

కావలసినవి

బోన్‌లెస్ నాటుకోడి ముక్కలు : పావుకేజీ
బ్రెడ్ ైస్లెసులు : 12
ఉల్లిగడ్డ ముక్కలు : అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు : రెండు టీస్పూన్లు
పుదీనా తరుగు : చెంచా
చీజ్ ైస్లెసులు : 6
చిల్లీసాస్ : 2 టీస్పూన్లు
మిరియాలపొడి : టీస్పూన్
వెన్న : అరకప్పు
మయొనైజ్ : 3 టీస్పూన్లు
ఉప్పు : తగినంతా.
తయారీ : చికెన్ ముక్కలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. చికెన్ ముక్కలకు మిరియాలపొడి, పర్చిమిర్చి, తగినంత ఉప్పు చేర్చి ఉడికించాలి. దీన్ని మిక్సీ పట్టాలి. తర్వాత పుదీనా తరుగూ, మయొనైజ్, తగినంత ఉప్పు, చిల్లీసాస్ కలిపి ముద్దలా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్‌ైస్లెసుల్ని పెనంపై ఉంచి వెన్నతో కాల్చి తీసుకోవాలి. ఒక ైస్లెసుపై చీజ్ ైస్లెసు, ఉల్లిగడ్డ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్ మిశ్రమాన్ని ఉంచి, మరో ైస్లెసుతో మూసేస్తూ దోరగా వేపుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. కావాలంటే లైట్‌గా నిమ్మరసం పిండి సాస్‌తో నాటుకోడి శాండ్‌విచ్‌ను సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news