ఓట్స్ పకోడి మజాయే వేరు!

-

ఓట్స్ అంటే ఔషధమే.. ఇక ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. ఊబకాయం తగ్గాలంటే ఓట్స్‌ గొప్ప ఆహారం. ఓట్స్‌లో ఉండే beta-glucan చెడు కొవ్వుని కరిగించి, అది రక్తంలో పేరుకోకుండా చేస్తుంది.ఒక గుప్పెడు ఓట్స్‌ కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

మరి ఇన్ని పోషక విలువలున్న ఓట్స్‌ని ఆహారంలో బాగం చేసుకోవాల్సిందేగా.. అందుకే ఓట్స్‌తో టేస్టీగా పకోడీ చేయడం నేర్చుకుందాం..
oats pakoda recipe in telugu

ఓట్స్ పకోడి తయారీ కావాల్సినవి

:
ఓట్స్ : ఒక కప్పు
బియ్యం పిండి : ఒక టేబుల్‌స్పూన్
శనగపిండి : 1 1/2 టీస్పూన్స్
పచ్చిమిర్చి : 2
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
ఉల్లిగడ్డ : 1
పెరుగు : 2 టేబుల్‌స్పూన్స్,
నూనె, ఉప్పు : తగినంత

ఓట్స్ పకోడి తయారీ

:
స్టెప్ 1 : ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి.
స్టెప్ 2: ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి.
స్టెప్ 3 : దీంట్లోనే పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి.
స్టెప్ 4 : ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి బాగా వేయించాలి. వేడి వేడిగా లాగిస్తే ఇవి మరింత టేస్టీగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news