మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అంతకుముందు ఏం ఫర్లేదులే అని పట్టించుకోకుండా తిరిగిన వారు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తూ ఆహార అలవాట్లని మార్చుకుంటున్నారు. ఊబకాయం వల్ల కరోనా ఇబ్బంది పెడుతుందని పొద్దున్నే లేచి వ్యాయామాలు చేస్తున్నారు. ఐతే ఊబకాయానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో వంటనూనె కూడా ఒక కారణం కావచ్చు. నిత్యావసర వస్తువైన వంటనూనెల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం కావచ్చు.
ఐతే కొవ్వు శాతం ఎక్కువగా కలిగిన వంటనూనెలని వద్దని వాటి బదులు ఇతర నూనెలని వాడాలని చాలా మంది సలహా ఇస్తున్నారు. అలాంటి నూనెల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఇందులో ఉండే ఇతర పోషకాలు జుట్టుకి, చర్మానికి సంరక్షణ కలిగిస్తాయి.
కొవ్వును నియంత్రించి బరువు పెరగకుండా చూడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
ఆలివ్ ఆయిల్ రకాలు.
ఎక్స్ట్రా వర్జిల్ ఆలివ్ ఆయిల్
మంచి రుచి కలిగిన ఈ ఆలివ్ ఆయిన్ ని తీయడానికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. ఇందులో చాలా తక్కువ శాతం ఆమ్లం ఉంటుంది. సలాడ్ లు వంటివి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
వర్జిన్ ఆయిల్
ఇందులో కూడా రసాయనాలు ఏమీ వాడరు. కాకపోతే ఎక్స్ట్రా వర్జిల్ ఆయిల్ తో పోలిస్తే ఆమ్లత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వేయించడానికి ఈ ఆయిల్ పనికొస్తుంది.
ఆలివ్ ఆయిల్.
ఈ ఆయిల్ ని శుద్ధి చేసే ప్రక్రియలో బొగ్గు, ఇతర రసాయనాలు వాడతారు. ఈ రకమైన నూనె ప్రతిరోజూ చేసే వంటలకి సరిపోతుంది.