చల్లని వాతావరణంలో వేడి వేడి కాపాచినో కాఫీ.. తయారీ చేసుకోండిలా..

వర్షాకాలం వచ్చేసిందన్నట్టు గుర్తుంచుకోవడానికి రోజూ వర్షం పడుతూనే ఉంది. దాదాపు దేశమంతా వాతావరణం చల్లబడింది. అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో వేడి వేడి ఆహారం, పానీయాలు ఆరగించాలని అందరికీ ఉంటుంది. అందులో ముఖ్యంగా కాఫీ ఇష్టపడేవారు చాలామంది. బయట చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ కడుపులో పడితే ఆ ఆనందమే వేరు. ఐతే ప్రస్తుతం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇంట్లోనే కాఫీ తయారు చేసుకోండి. అది కాపాచినో ( cappuccino ) అయితే ఆ మజానే వేరు.

కాపాచినో | cappuccino

కాపాచినో కాఫీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

దీనికి కావాల్సిన పదార్థాలు

పాలు- 3/4కప్పులు
క్రీమ్- 2టేబుల్ స్పూన్లు
కాఫీ పౌడర్- 2టేబుల్ స్పూన్లు
కాస్టర్ షుగర్- 1టేబుల్ స్పూన్
వేడినీళ్ళు- 2టేబుల్ స్పూన్

తయారీ

ఒక పాత్రలో పాలు, క్రీమ్ మిక్స్ చేసి వాటిని కొద్దిసేపు మరిగించాలి. మిగతా పదార్థాలను తీసుకుని అందులో కలపాలి. ఒక్కసారి పాలు మరగగానే దాన్ని స్టవ్ మీదనుండి తీసివేయాలి. ఆ పాలు నురుగు వచ్చేలా చేయాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు కాఫీ పౌడర్, చక్కెర, వేడినీళ్ళు దానిలో పోయాలి. ఆ తర్వాత ఆ కాఫీ రంగు మారే వరకు స్టవ్ మీద బాగా మరిగించాలి. బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా అలాగే ఉంచాలి.

అంతే మీ కాఫీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ప్రయత్నించి చూడండి.