వేసవి స్పెషల్: వాటర్ మెలన్ ఫెటా సలాడ్.. చిటికెలో తయారు చేయొచ్చు..!

-

ఎండాకాలంలో విరివిరిగా లభించే పుచ్చకాయలతోనే ఈ స్నాక్స్ తయారు చేసేది. తీయగా, రుచికరమైన వంటకాలు చేస్తేనే కదా అసలు మజా. ఆ మజా రావాలంటే ఈ వంటకం సరైన చాయిస్.

అబ్బబ్బబ్బ.. ఏం ఎండలురా బాబోయ్. ఆ ఎండలకు ఏది తిందామన్నా తినబుద్ధి కావట్లేదు అని టెన్షన్ పడుతున్నారా? మీలాంటి వాళ్ల కోసమే ఓ మంచి స్నాక్ ఐటెమ్ ఉంది. చిటికెలో దాన్ని తయారు చేయొచ్చు. ఎండ వేడిలో లొట్టలేసుకుంటూ తినొచ్చు. ఇవి ఎంతో చలువ కూడా. సలాడ్ లా చేసుకోవాలి.

Watermelon Feta Salad Recipe

ఎండాకాలంలో విరివిరిగా లభించే పుచ్చకాయలతోనే ఈ స్నాక్స్ తయారు చేసేది. తీయగా, రుచికరమైన వంటకాలు చేస్తేనే కదా అసలు మజా. ఆ మజా రావాలంటే ఈ వంటకం సరైన చాయిస్. అది కూడా చిటికెలో దీన్ని తయారు చేయొచ్చు. అదే వాటర్ మెలన్ ఫెటా సలాడ్.

దీన్ని తయారు చేయడానికి వాటర్ మెలన్, 200 గ్రాముల ఫెటా(చీజ్), ఉల్లిఆకు, అరుగుల(ఆకుకూర) 100 గ్రాములు, 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, టేస్ట్ కోసం బాల్సామిక్ వెనిగర్, పెప్పర్ ఉంటే చాలు.. ఆన్ ది స్పాట్ వాటర్ మెలన్ ఫెటా సలాడ్ చేసేయొచ్చు.

ఇలా తయారు చేయండి..

పుచ్చకాయను ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. గింజలు తీసేయండి. పుచ్చకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి పెట్టండి. తర్వాత ఉల్లి ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పుచ్చకాయ ముక్కల్లో కలపండి. ఫెటా చీజ్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పుచ్చకాయ మిశ్రమంలో కలపండి. ఆ మిశ్రమాన్ని బాగా కలపండి.

అరుగుల ఆకు కూరలను ఓ ప్లేట్ లో వేసి.. పుచ్చకాయ మిశ్రమాన్ని ఆ ఆకు కూరపై వేయండి. ఆ తర్వాత ఆ మిశ్రమం మీద ఆలివ్ ఆయిల్ కొంచెం, బాల్సామిక్ వెనిగర్ కొంచెం, పెప్పర్ వేయండి.. అంతే వాటర్ మెలన్ ఫెటా సలాడ్ రెడీ అయిపోయినట్టే. బయట ఎండ.. మీరు ఇంట్లో ఈ సలాడ్ ను ఎంజాయ్ చేస్తూ తినేయండి.

దీన్ని ఎలా తయారు చేయాలో మీకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి. మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news