స్వీట్ పొటాటోతో చాట్.. ఈవినింగ్‌ టైమ్‌లో తింటే మస్త్‌ ఉంటదిలే..! 

-

ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా ఉండేది తినాలని అందరికీ అనిపిస్తుంది. బయట ఉంటే..చాట్‌బండి వైపు చూస్తాం.. మరీ ఇంట్లో ఉంటే ఏం చేయాలి.. ఆ టైంకి ఏం తింటే బాగుంటుంది. ఇది సమ్మర్‌ కాబట్టి.. వేడి వేడిది తింటే అంత మంచిగా అనిపించదు. స్వీట్‌ పొటాటో చాట్‌ ఈవినింగ్‌ తినడానికి మంచి స్నాక్‌ ఐటమ్.. చిలకడదుంపలు ఏ వంటల్లో వేసినా.. ఉప్పులేని లోటు తెలియదు. ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు. మరి అది ఎలా చేయాలో చూద్దామా..!

స్వీట్‌ పొటాటో చాట్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ఉడకపెట్టిన చిలకడదుంప ముక్కలు ఒక కప్పు
పచ్చిమామిడికాయ ముక్కలు అరకప్పు
కట్‌ చేసిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
ఉడకపెట్టిన స్వీట్‌ కార్న్‌ గింజలు అరకప్పు
వేపించిన వేరుశనగ పప్పులు అరకప్పు
కొత్తిమీర పావుకప్పు
ఖర్జూరం ముక్కలు రెండు టేబుల్‌ స్పూన్‌
దానిమ్మ గింజలు రెండు టేబుల్‌ స్పూన్‌
పుదీనా ఒక టేబుల్‌ స్పూన్
లెమన్‌ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
మిరియాల పొడి ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం..

మిక్సీజార్‌ తీసుుకని అందులో మామిడి ముక్కలు , పచ్చిమిరపకాయలు, పుదీనా, పండు ఖర్జూరం ముక్కలు వేసి గ్రైండ్‌ చేయండి. ఈ ముద్దను పక్కన పెట్టుకోండి. ఉడికించిన చిలకడదుంపలు తొక్కతీసి వాటిని కట్‌ చేసుకోండి. చిన్న నాన్‌స్టిక్‌ పాత్రలో మీగడ వేసి.. చిలకడదుంప ముక్కలను దోరగా వేయించండి. ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి , లెమన్‌ జ్యూస్‌ వేసి, చిన్నగా కట్‌ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి కలపండి. అందులో రోస్ట్‌ చేసుకున్న చిలకడదుంప ముక్కలు వేయండి. పొట్టుతీసిన వేరుశనగపప్పు, కొత్తిమీర, ఉడికించిన స్వీట్‌ కార్న్‌ గింజలు, మామిడికాయ ఖర్జూరం పేస్ట్‌ రెండు టేబుల్ స్పూన్స్‌ వేయండి. అన్ని బాగా కలుపుకోండి. ఇందులో ఉన్నవి అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి. దానిమ్మ గింజలుకూడా వేసుకుంటే.. చాట్‌ రెడీ.! ఈవినింగ్‌ టైమ్స్‌లో ఇలా తింటుంటే.. ఎంజాయ్‌ చేస్తూ తినొచ్చు.! ఈసారి మీరు కూడా ట్రై చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news