వెజ్ లాలిపాప్ ను ఎలా చేసుకోవాలో తెలుసా?

-

లాలిపాప్స్ ఎక్కువగా చికెన్ తో చెయ్యడం చూసే ఉంటారు.ఒక్కో రేటుతో ఒక్కో రకమైన రుచితో ఉన్న లాలిపాప్స్ ను తయారు చేస్తారు.అయితే వెజ్ ఐటమ్స్ తో లాలిపాప్స్ చేయడం ఎప్పుడు విని ఉండరు.. ఇది వినడానికి కొత్తగా కూడా ఉంటుంది. టెస్ట్ విషయాన్నికొస్తే అదుర్స్ అంటున్నారు చెప్ లు..ఆ లాలిపాప్స్ కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలిసుకుందాము..

కావలసిన పదార్థాలు:

ఆలుగడ్డలు- రెండు,
క్యాబేజీ ముక్కలు- పావు కప్పు,
క్యారెట్‌ తురుము- పావు కప్పు,
క్యాప్సికమ్‌ ముక్కలు- మూడు స్పూన్లు,
ఉల్లి ముక్కలు- మూడు స్పూన్లు,
అల్లం వెల్లుల్లి పేస్టు- అర స్పూను,
పసుపు- చిటికెడు,
కారం- పావు స్పూను,
మిరియాల పొడి- పావు స్పూను,
ధనియా, గరం మసాలా పొడి- అర స్పూను,
వరి పిండి- మూడు స్పూన్లు,
శెనగ పిండి- స్పూను,
నీళ్లు, నూనె, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:

మొదటగా పైన తెలిపిన కూరగాయలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లోనే పొడులన్నిటినీ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పూ కారాన్నీ చేర్చాలి. బియ్యం పిండినీ వేసి తగినంత నీటితో ముద్దగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరవాత చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగ పిండిని నీటితో కాస్త జారుగా కలుపుకోవాలి. ఇందులో కూరగాయల ముద్దల్ని ముంచి నూనెలో వేయించి తీయాలి. టూత్‌పిక్‌లను ఒక్కో ముద్దకు గుచ్చితే వెజ్‌ లాలీపాప్ రెడీ… మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి..టమోటా సాస్ లతో తీసుకుంటే చాలా బాగుంటుంది..పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో కూరగాయలు ఉన్నాయి హెల్త్ కు చాలా మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news