నోరూరించే ఫలూదాను టేస్ట్ చేశారా ఎప్పుడైనా?

-

Making various flavours of Faluda

ఫలూదాను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఒక్క గ్లాసు కాదు.. రెండు గ్లాసులు కాదు.. తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫలూదా. ఫలూదాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. దేనికదే టేస్ట్. నిజానికి ఫలూదా మన డెజర్ట్ కాదు. రాజస్థాన్ డెజర్ట్ అది. కాకపోతే.. రాజస్థానీయులు ఫలూదాను అందరికీ పరిచయం చేశారు. ఫలూదాలో కస్టర్డ్ ఫలూదా, స్ట్రాబెర్రీ ఫలూదా, రూఅఫ్జా ఫలూదా, సోయాపాల ఫలూదా, ఫ్రూట్స్ ఫలూదా, కుల్ఫీ ఫలూదా, మిక్స్ డ్ ఫలూదా.. లాంటి ఫ్లేవర్స్ ఉంటాయి.

ఏ ఫలూదా తయారు చేయాలన్నా ముఖ్యంగా కావాల్సినవి ఫలూదా సేవ్, సబ్జా గింజలు, రూఅఫ్జా, వెనీలా ఐస్ క్రీం.. ఇవి మార్కెట్ లో దొరుకుతాయి. మిగితావి ఏ ఫ్లేవర్ ను బట్టి వాటిని వాడుకోవచ్చు.

ముందుగా కొన్ని పాలను బాగా మరిగించాలి. కస్టర్డ్ ఫలూదా కావాలనుకున్నవాళ్లు.. ఆ పాలల్లో కస్టర్డ్ పొడి వేసుకోవాలి. తర్వాత ఫలూదా సేవ్, కొంచెం చెక్కర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం చల్లారాక.. రూఅఫ్జా, సబ్జా గింజలు, ఐస్ క్రీం, డ్రైఫ్రూట్స్ వేసుకొని కస్టర్డ్ ఫలూదాను లాగించేయడమే.

ఇలాగే మిగితా ఫ్లేవర్స్ కూడా.. స్ట్రాబెర్రీ ఫలూదా కావాలనుకున్నవాళ్లు… రోజ్ సిరప్, స్ట్రాబెర్రీ క్రష్ తో చేసుకోవచ్చు. రోజ్ సిరప్ ను ఓ గ్లాస్ లో వేసుకోవాలి. దానిలో సబ్జా, సేవ్, స్ట్రాబెర్రీ క్రష్ వేయాలి. వాటి మీద పాలు పోయాలి. దాని మీద ఐస్ క్రీం. అంతే.. స్ట్రాబెర్రీ ఫలూదా రెడీ.

రూఅఫ్జా ఫలూదా కావాలనుకుంటే… సేమ్… అదే ప్రొసీజర్ కాకపోతే ఫ్లేవర్ మారుతుంది. అలాగే మిగితా ఫ్లేవర్స్ కూడా తయారు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news