మల్టీగ్రెయిన్ డ్రై ఫ్రూట్ కేక్.. మైదాతో పనిలేదు..షుగర్ అ‌వసరమే రాదు..!

-

పిల్లలకు కేక్ అంటే ఎగిరిగంతేస్తారు. అసలు వదిలిపెట్టకుండా తింటారు. కానీ బయట దొరికే కేకులు మైదాతో తయారు చేస్తారు కాబట్టి.. దీని వల్ల బరువు పెరుగుతారు. అదికూడా హెల్తీ బరువు కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు.. అందుకే ఈరోజు మనం ఇంట్లోనే మల్టీగ్రెయిన్ డ్రై ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. దీనిలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మల్లీగ్రెయిన్ పిండి ఉంటుంది కాబట్టి.. ఆరోగ్యానికి మంచిది..టెస్ట్ కూడా డబుల్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా..!

మల్టీగ్రెయిన్ డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

రాగిపండి అరకప్పు
జొన్నపిండి అరకప్పు
సజ్జపిండి అరకప్పు
గోధుమ పిండి అరకప్పు
పాలు అరకప్పు
తేనె ఒక కప్పు
ఖర్జూరం ముక్కలు పావు కప్పు
కిస్ మిస్ లో పావు కప్పు
యాప్రికాడ్ ముక్కలు పావు కప్పు
బాదం ముక్కలు పావు కప్పు
జీడిపప్పు ముక్కలు పావు కప్పు
వంటసోడా అర టీ స్పూన్
బేకింగ్ సోడా ఒక టీ స్పూన్
యాలుకల పొడి ఒక టీ స్పూన్
దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రాగిపిండి, సజ్జపిండి, గోధమ పిండి, జొన్నపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ముక్కలుగా చేసుకున్న ఖర్జూరం, కిస్ మిస్, యాప్రికాడ్ ముక్కలు, బాదం, జీడిపప్పు, తేనె వేసుకుని ఉండలు లేకుండా కలిపేయండి. పాలు పోసి పలుచగా చేసుకోండి. అందులో యాలుకల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోండి. కేక్ ట్రేకు మీగడ రాసి మనకు కావాల్సిన షేప్ లో ఈ పిండి వేసి పైన బాదం, జీడిపప్పు ముక్కలు వేయండి. మందపాటి అల్యుమినియం పాత్రలో కింద రింగ్ లాంటిది పెట్టి దానిపైన కేక్ ట్రే పెట్టేసి మూతపెట్టేసి అరగంట పాటు ఉంచండి. మల్టీ గ్రెయిన్ డ్రై ఫ్రూట్ కేక్ రెడీ.. షుగర్ లేదు, మైదా లేదు.. అయినా టేస్ట్ కు డోకా లేదు. చిన్నపిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే హ్యాపీగా లాగించేస్తారు.
Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news