చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్ స్మూతీ.. త‌యారు చేద్దామా..!

-

వేస‌విలో పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పుచ్చ‌కాయ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం అందుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. దీంతోపాటు ప‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు పుచ్చ‌కాయ‌ల ద్వారా ల‌భిస్తాయి. అయితే పుచ్చకాయ‌ల‌ను నేరుగా తిన‌డంతోపాటు దాంతో చ‌ల్ల చ‌ల్ల‌గా స్మూతీ త‌యారు చేసుకుని తాగినా.. మ‌న‌కు అవే లాభాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే వాట‌ర్‌మిల‌న్ స్మూతీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట‌ర్‌మిల‌న్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

పుచ్చ‌కాయ ముక్క‌లు (విత్త‌నాలు తీసి క‌ట్ చేయ‌బ‌డిన‌వి) – ఒక‌టిన్నర క‌ప్పు
స్ట్రాబెర్రీలు – ఒక క‌ప్పు
బాగా పండిన అర‌టి పండు – స‌గం
బాదం పాలు – 1/2 నుంచి 3/4 క‌ప్పు
నిమ్మ‌ర‌సం – 1 టీస్పూన్
చియా విత్త‌నాలు – 1 టేబుల్ స్పూన్

వాట‌ర్ మిల‌న్ స్మూతీ త‌యారు చేసే విధానం:

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను బ్లెండ‌ర్‌లో వేసి చ‌క్క‌ని చిక్క‌ని స్మూతీ వ‌చ్చేలా ప‌ట్టుకోవాలి. అవ‌స‌రం అనుకుంటే బాదం పాలను ఎక్కువ‌గా పోయ‌వచ్చు. లేదా స్ట్రాబెర్రీలు, ఐస్ వేసుకోవ‌చ్చు. ఇక టేస్ట్ కోసం నిమ్మ‌ర‌సం క‌లుపుకోవ‌చ్చు. తియ్య‌గా ఉండాల‌నుకుంటే అర‌టి పండు మోతాదు పెంచ‌వ‌చ్చు. లేదా పుచ్చ‌కాయ ముక్క‌లు మ‌రిన్ని వేసుకోవ‌చ్చు. దీంతో వాట‌ర్ మిల‌న్ ఫ్లేవ‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంది. ఈ స్మూతీపై అలంక‌ర‌ణ కోసం చియా సీడ్స్ వేయ‌వ‌చ్చు. దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని వాట‌ర్ మిల‌న్ స్మూతీ త‌యారు అవుతుంది. దీన్ని 2, 3 రోజుల వ‌ర‌కు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తాగ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news