నీళ్ళు తక్కువ తాగితే శరీరంలో ఏం జరుగుతుంది? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి?

-

ఈ భూమి మీద మూడొంతుల వంతు నీరు ఉంటుందని మనం చదువుకున్నాం. మానవాళికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల మీద లేని కొన్ని ప్రత్యేకమైన అంశాలు భూమి మీద ఉండబట్టే మానవాళీ మనుగడ సాధ్యమైంది. ఇప్పటికీ ఎప్పటికీ మనిషి మనుగడ సాగాలంటే నీరు ఖచ్చితంగా అవసరం. భూమి మీద నీరు ఎంత ఇంపార్టెంటో భూమి మీద నివసిస్తున్న జీవిలో నీళ్ళు అనేది అంత ఇంపార్టెంట్.

రోజులో కనీసం నాలుగు లీటర్ల నీళ్ళైనా తాగాలని చెబుతుంటారు. లేదంటే ఇబ్బందులు వస్తాయని, ఆరోగ్యం చెడిపోతుందని అంటుంటారు. అసలు నీళ్ళు తాగకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్ళూ తక్కువ తాగుతున్నట్లయితే మన శరీరానికి శక్తి అందదు. మనం తాగిన నీరు రక్తం ద్వారా ప్రతీ కణానికి చేరి శక్తిని అందిస్తుంది. నీళ్ళలో ఆక్సిజన్ ఉంటుంది. వాటిని తాగడం వల్ల శరీరానికి సరైన ఆక్సిజన్ అందుతుంది. ముఖ్యంగా మెదడుకి ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్ అందకపోతే, మెదడు పనితీరు దెబ్బతింటుంది. దానివల్ల మీరు సరిగ్గా పనిచేయలేరు.

కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. నీళ్ళని తక్కువగా తాగడం వల్ల అవి పనిచేసే తీరు దెబ్బ్బతిని శరీరంపై ప్రభావం పడుతుంది. వెంట్రుకలు రాలిపోతుంటాయి. చర్మం దాని రంగు కోల్పోతుంది. ముఖంలో కళ తప్పుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరం వేడి చేసిందని చాలా మంది చెబుతుంటారు. దానికి కారణం కావాల్సినన్ని నీళ్ళు తీసుకోకపోవడమే. ఎలాగైతే రేడియేటర్లో నీళ్ళు లేకపోతే కారు నడవదో, అలాగే శరీరంలో నీళ్ళు తగ్గిపోతే మనిషి నడవడం కష్టమవుతుంది.

పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా పెదవులపపై, చెవుల వెనకాల ఖచ్చితంగా రాసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news