Rakul Preet Singh : గ్లిట్టర్ శారీలో రకుల్ ట్రెండీ లుక్స్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

-

రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన ఫొటోషూట్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. ఈసారి చీరకట్టులో కనికట్టు చేసింది. గ్లిట్టర్ శారీలో మెస్మరైజింగ్ లుక్స్ తో మెరిసిపోయింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు మనసు బేజారు చేసింది. చీరలోనూ రకుల్ సూపర్ ట్రెండీగా కనిపిచింది.

రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. గ్లిట్టర్ శారీలో రకుల్ లుక్స్ చాలా కూల్ గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ కు మకాం మార్చిన రకుల్ ను త్వరగా టాలీవుడ్ లో కమ్ బ్యాక్ ఇవ్వమని రిక్వెస్టులు పెడుతున్నారు. వి మిస్ యూ రకుల్ అంటూ తెగ మథనపడిపోతున్నారు.

ఇక రకుల్ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ కెరటం సినిమాతో సినీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చి ఆ తర్వాత వరుస విజయాలతో అవకాశాలు అందుకుంటూ తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది. ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది.

Read more RELATED
Recommended to you

Latest news