Sobitha Dhulipala : తెల్లాతెల్లాని చీరలో తెలుగు సోయగం శోభిత స్టన్నింగ్ ఫొటోలు

-

శోభిత ధూళిపాళ.. ఈ తెలుగందం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే శోభిత డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తోంది. తాజాగా ఈ భామ వైట్ శారీలో కనిపించి కనువిందు చేసింది. చీరకట్టులో శోభిత బ్యూటీఫుల్ గా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శోభిత శారీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. చీరలో శోభిత మెస్మరైజ్ చేసిందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతయినా అమ్మాయిలు చీరకడితే ఆ అందమే వేరంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ భామపై తమ ప్రేమను హార్ట్, ఫైర్ ఎమోజీస్ తో రూపంలో చూపిస్తున్నారు.

శోభిత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాలు చేస్తోంది. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మరికొన్ని రోజుల్లో పార్ట్ 2 తో ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news