కేన్స్​లో బార్బీడాల్​ ఔట్​ఫిట్​లో ఊర్వశి.. మెడలో మొసలి నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్

-

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ – 2023 వేడుకలు చాలా గ్రాండ్​గా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేన్స్​కు పలువురు భారతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. డిఫరెంట్ ఔట్​ఫిట్స్​లో కేన్స్ కాన్వాస్​పై ఇండియన్ గ్లామర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. తొలిసారిగా పలువురు బాలీవుడ్ భామలు కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చారు. అందాల భామ ఊర్వశీ రౌతేలా స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను అలరించింది.

పింక్‌ ఔట్​ఫిట్​లో బార్బీడాల్​లా మెరిసిపోయింది ఊర్వశి. ఔట్​ఫిట్​ ఎలాగూ అట్రాక్ట్ చేసింది. కానీ ఈ బ్యూటీ తన మెడలో ధరించిన మొసళ్ల నెక్లెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకునే ఆ అందాల భామ ధరించిన నెక్లెస్‌లో ఉన్నది సాధారణ డిజైన్‌ కాదు. గతంలో మనం ఎన్నడూ చూడని ప్రత్యేక డిజైన్‌.

బంగారు మొసళ్లతో ఆ నెక్లెస్‌ను డిజైన్‌ చేశారు. రెండు మొసళ్లను మెడలో వేలాడేసుకున్నట్లుగా ఆ నెక్లెస్‌ ఉంది. ఆ నెక్లెస్‌కు మ్యాచింగ్‌ ఇయర్‌ రింగ్స్‌ను కూడా ఊర్వశి ధరించింది. ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన తన ఫొటోలు, వీడియోలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news