పీకలదాకా తాగి ట్రాఫిక్ పోలీసులను చితకబాదాడు.. వీడియో

-

ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు. ఎంతలా అంటే ట్రాఫిక్ పోలీసులను చితకబాదేంత. తను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఏది దొరికితే దాంతో ట్రాఫిక్ పోలీసులను చితకొట్టాడు. కర్ణాటకలోని దేవనగిరిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ట్రాఫిక్ పోలీసులతో గొడవ పెట్టుకున్న ఆ వ్యక్తి ఏకంగా పక్కనే ఉన్న రాయితో ఓ పోలీస్‌ను కొట్టాడు. అనంతరం మరో ట్రాఫిక్ పోలీసుపైకి దూసుకెళ్లాడు. అతడిని కింద పడేసి కొట్టాడు. ఓ పోలీస్‌కు గాయాలయ్యాయి. తాగుబోతును వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news