బాల్కనీల మధ్య నెమలి ఎగురుతున్న వీడియో వైరల్‌.. ఫిదా అవ్వాల్సిందే !

మన జాతీయ పక్షి నెమలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెమలి అంటేనే అందమైన పించం. సప్తవర్ణాల తో అందంగా కనువిందు చేస్తుంది నెమలి. ఇది సర్వ సాధారణంగా అందరికీ కనిపించే దృశ్యం. మనదేశంలో నెమలికి ఉన్న ప్రత్యేకత ఏ పక్షికి లేదు. తన పింఛంతో ఎంతో అందంగా కనిపిస్తుంది నెమలి. ప్రతి ఒక్కరూ నెమలి అందానికి ఫిదా కావాల్సిందే.

 

మన పిల్లల్లో ఈ జంతువు పెంచుకోవడానికి మన ఇండియాలో రూల్ లేదు. కచ్చితంగా జూ పార్కు వెళ్లి.. మిమ్మల్ని చూడాల్సిందే. అయితే తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ నెమలి హల్ చల్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో… నెటిజెన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఢిల్లీలోని ఓ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి. అయితే ఆ బిల్డింగ్ బాల్కనీలో ఒక నెమలి… ఆ బాల్కనీ నుంచి ఇటు.. ఈ బాల్కనీ నుంచి అటు దూకుతూ కనిపించింది. ఎంతో స్వేచ్ఛగా ఆ బాల్కనీ ల మధ్య ఎగిరింది నెమలి. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్, సూపర్, మిరాకిల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో 7 మిలియన్ వ్యూస్ దాటేసింది.