BREAKING : మరో 1433 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ అలాగే పంచాయతీరాజ్ శాఖ లో హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది.

420 చీఫ్ ఇంజనీరింగ్ అంటే రూరల్ వాటర్ సప్లై పోస్టులు, 350 ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అంటే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పోస్టులు, 196 మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అలాగే 236 పబ్లిక్ హెల్త్ మరియు ఇతర పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ… అధికారిక ప్రకటన చేసింది ఆర్థికశాఖ.

అలాగే ఆరోగ్య శాఖలో 1326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే మొదటి దశ నోటిఫికేషన్ కు ఏర్పాట్లు చేయాలని మెడికల్ బోర్డుకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచనలు కూడా చేశారు. కరోనా కాలంలో సేవలందిచిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20శాతం వేయిటీజీ ఇస్తామని వారికి శుభ వార్త చెప్పారు మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news