ఒక్కొక్కసారి మనకి కడుపులో గడబిడగా ఉంటుంది. మీకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుందా..? అన్నం తినాలని అస్సలు అనిపించదా..? ఇబ్బందిగా ఉంటుందా అయితే కచ్చితంగా ఇలా అనుసరించండి. అప్పుడు కడపలో గడబిడ తొలగిపోతుంది.
అల్లం టీ లేదా అల్లాన్ని తీసుకోండి
కడుపులో గడబిడ ఉంటే అల్లంతో టీ తయారు చేసుకుని తీసుకోండి. వెంటనే కడుపునొప్పి పోతుంది. కడుపులో గడబిడ మాయమైపోతుంది. అల్లం టీ తాగాలని లేకపోతే మీరు అల్లంతో ఏదైనా రెసిపీ తయారు చేసుకుని తీసుకోవచ్చు లేదంటే మీ వంటకాలలో అల్లం వేసుకోవచ్చు.
పుదీనా
పుదీనా కూడా చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది కడుపు నొప్పి నుండి బయట పడేస్తుంది చక్కగా హ్యాపీగా ఉండొచ్చు.
అసలు నిద్రపోకండి
కడుపు నొప్పి కానీ కడుపు లో ఇబ్బందిగా కానీ అనిపిస్తే పడుకోకండి గ్యాస్ పైకి వెళ్ళిపోతుంది దీని వలన గుండెల్లో మంట వస్తుంది.
నిమ్మరసం
నిమ్మరసం కూడా చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది జీర్ణ సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తుంది ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని బేకింగ్ సోడా నిమ్మరసం వేసుకుని తీసుకుంటే ఈ సమస్య మాయమైపోతుంది.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లతో కూడా రిలీఫ్ ని పొందొచ్చు ఒకవేళ కనుక మీకు కడుపులో గాబరాగా కానీ గడపడక కానీ అనిపిస్తే కొబ్బరి నీళ్లు తీసుకోండి. అరటిపండు తమలపాకు కూడా చక్కటి రిలీఫ్ ని ఇస్తాయి కాబట్టి మీకు కడుపులో ఇబ్బంది ఉంటే ఇలా అనుసరిస్తే సరిపోతుంది.