మీట్‌ అలర్జీ అంటే ఏంటీ..? ఇది ప్రాణాంతకమా..?

-

మీట్‌ అలర్జీ అంటే మీకు ఆశ్యర్యంగా అనిపించి ఉండొచ్చు..కానీ కొంతమందికి మాంస తిన్నాక ఆగం ఆగంగా ఉంటుంది.. నాన్‌వెజ్‌ తిన్నాక కూల్‌డ్రింక్‌ తాగాలన్న కోరిక ఉంటుంది. ఒకవేళ వాళ్లు కూల్‌డ్రింక్‌ తాగలేదంటే చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటారు. పొట్టలో ప్రశాంతంగా ఉండదు.. చికెన్‌ అంటే లొట్టలేసుకుని తినేవాళ్లకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి..? ఫుడ్‌ అలర్జీ ఎలాగో మీట్‌ అలర్జీ కూడా అలాగే.. అయితే ఈ సమస్య ఉందని అనుభవించే వాళ్లకు కూడా తెలియదు.. ఈరోజు మనం ఈ అలర్జీ లక్షణాలు ఏంటి, చికిత్స ఏమైనా ఉందా అనేది చూద్దాం.!

చాలా మందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, పాల పదార్థాలు వంటివి పడవు. కానీ ఈ మాంసం అలెర్జీలు ఇతర రకాల ఆహార అలెర్జీల కంటే తక్కువ కేసుల్లో కనిపిస్తుంది. కొంతమందికి చికెన్ తింటే చర్మంపై దద్దుర్లు, మంట కలుగుతుంటుంది. గుడ్లు తిన్నా కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఎక్కువగా గొర్రె మాంసం, పంది మాంసం, గొడ్డు మాంసం తినేవారికి మాంసం అలర్జీల తీవ్రత ఎక్కువగా ఉంటుందట..కొన్ని మాంసాల రకాలలో అలెర్జీని ప్రేరేపించగల ప్రోటీన్లు ఉంటాయి. అలాంటి మాంసాన్ని మీరు తిన్నప్పుడు మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. ఈ సమయంలో శరీరం రక్త ప్రవాహంలోకి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు అలెర్జీ ప్రతిచర్య జరుగుతుంది. హిస్టమైన్ కొన్నిసార్లు తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీని వలన రక్త నాళాలు విస్తరిస్తాయి, శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాలు సక్రియం అవుతాయి. అప్పుడు మీ శరీరం మీకు వివిధ రకాల సంకేతాలను ఇస్తుంది.

ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారికే ఎక్కువ..

సాధారణంగా ఈ మాంసం అలర్జీలు బ్లడ్ గ్రూప్ A లేదా O కలిగిన వ్యక్తులను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.. అందుకే బ్లడ్ గ్రూప్‌కు తగినట్లుగా కూడా ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు.

మాంసం అలర్జీ లక్షణాలు ఎలా ఉంటాయి.?

దద్దుర్లు
కణజాలంలో వాపు
తలనొప్పులు
కడుపులో తిమ్మిరి
అతిసారం
వికారం లేదా వాంతులు
తుమ్ములు
ముక్కు కారడం లేదా మూసుకుపోవడం
కళ్ల నుంచి నీరు కారటం
శ్వాస ఆడకపోవుట
వేగవంతమైన హృదయ స్పందన రేటు
మైకము, మూర్ఛ

లక్షణాలు వేగంగా లేదా గంటల వ్యవధిలో కనిపిస్తాయి.. అరుదైన సందర్భాల్లో, మాంసం అలెర్జీ ప్రాణాంతకమైన, అనాఫిలాక్సిస్ అని పిలిచే పరిస్థితికి కూడా దారితీయవచ్చు. తక్షణమే చికిత్స తీసుకోలేకపోతే, ఈ అనాఫిలాక్సిస్ మూర్ఛ, కోమా, షాక్, గుండె లేదా శ్వాసకోశ వైఫల్యంకు కారణమై మరణానికి కూడా దారితీస్తుంది.

చికిత్స ఉందా..?

మాంసం అలెర్జీకి ఉత్తమ చికిత్స అంటే నివారణ మాత్రమే. మీకు అలెర్జీ ఉన్న నిర్దిష్ట మాంసం లేదా మాంసం ఉప ఉత్పత్తులను నివారించడం ముఖ్యం. ఆ నిర్ధిష్ట మాంసానికి బదులుగా ప్రత్యామ్నాయ మాంస రకాలను తినవచ్చు. కాల్చిన మాంసంకు బదులుగా బాగా ఉడికించిన మాంసం తినడానికి ప్రయత్నించండి. మాంసం ఉడికించడం ద్వారా వాటిలోని అలెర్జీని ప్రేరేపించే ప్రోటీన్లు విచ్ఛిన్నం అవుతాయి. అప్పుడు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news