చాలామంది బద్ధకంగా ఉంటూ ఉంటారు. రోజంతా కూడా వాళ్లకి బద్దకంగానే ఉంటుంది. ఏ పని కూడా చెయ్యాలని అనిపించదు. ఎంతగానో రోజంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు కూడా అలానే ఉందా..? అయితే కచ్చితంగా మీరు వీటిని చూడాల్సిందే. వీటిని తీసుకుంటే కచ్చితంగా రోజంతా బద్ధకంగా ఉంటుంది. చలాకీగా ఉండలేరు ఏ పని చేయలేరు. ఏదైనా పని చేయాలన్నా వర్క్ మీద ధ్యాస పెట్టాలన్నా ఈ ఆహార పదార్థాలను తీసుకోకండి ఎందుకంటే మీరు ఫోకస్ చేయలేరు. బద్దకంగా ఉంటుంది.
బ్రెడ్ తో తయారు చేసిన ఆహార పదార్థాలని బేకరీ ఉత్పత్తిని అసలు తీసుకోవద్దు వీటివలన బద్ధకం బాగా పెరుగుతుంది. చక్కెర పిండి ఎక్కువగా ఉంటాయి వీటిలో. జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా ఉంటుంది బద్ధకం కూడా బాగా వస్తుంది. అలానే కెఫిన్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు అధిక మోతాదులో కెఫీన్ ఉండే పదార్థాలను తీసుకుంటే శక్తిని కోల్పోతూ ఉంటారు అందుకని కెఫీన్ ని ఎక్కువగా తీసుకోకూడదు. లిమిట్ గా తీసుకోవాలి లేకపోతే సమస్యలు వస్తాయి.
చెర్రీస్ మంచివే కానీ వాటిని కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కంటెంట్ బద్దకాన్ని కలిగిస్తుంది రాత్రిపూట చెర్రీస్ ని తినొచ్చు కానీ ఏదైనా పని వున్నా ఫోకస్ పెట్టాలన్నా చెర్రీస్ ని తీసుకోకండి. పాస్తాని కూడా ఎక్కువ తీసుకోవద్దు. పాస్తా తీసుకుంటే కూడా బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలనిపించదు. కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను కూడా తీసుకోకండి ప్రాసెస్ ఫుడ్ ని తీసుకోవడం వలన బద్ధకం పెరుగుతుంది.
వేయించిన ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా బద్ధకంగా ఉంటుంది ఏ పని చేయాలని అనిపించదు ఎనర్జీ బార్స్ ని తీసుకుంటే శక్తిని తగ్గించేస్తాయి. ఇందులో ఎక్కువగా ఫ్యాట్ షుగర్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రక్తం లో చక్కెర స్థాయిలని ఇన్ బాలన్స్ చేస్తాయి సో వీటిని వర్క్ చేసే ముందు ఫోకస్ పెట్టేముందు అసలు తీసుకోకండి.