తరచూ బాత్రూమ్‌కు వెళ్తున్నారా..? అయితే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం…

-

ఏదైనా సరే ఎంతవరకూ జరగాలో అంత వరకు జరిగితేనే బాగుంటుంది. అతిగా చేస్తే అది ఎక్కడైనా మనకు లేనిపోని సమస్యలనే తెచ్చిపెడుతుంది. మన బాడీలో వ్యర్థాలు, టాక్సిన్‌లు బయటకు రావాలంటే..మల విసర్జన ద్వారానే అది సాధ్యం. రోజూ సాఫీగా ఇది జరిగితే ఎలాంటి సమస్యా ఉండదు. లేకపోతే అయితే మలబద్ధకం లేదంటే విరోచనాలతో బాధపడాలి. ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్తున్నా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లే వారిలో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాలకు వచ్చే అవకాశం ఉందట.

పెకింగ్ యూనివర్సిటీకి చెందిన కొందరు నిపుణులు చేసిన పరిశోధనల్లో కొన్ని షాకింగ్‌ విషయాలు తేలాయి. రోజుకు ఒక్కసారైనా మలవిసర్జన చేయని వారిలో గుండె సమస్యల ప్రమాదాన్ని సూచిస్తుందని, అలాగే వారానికి మూడు కంటే తక్కువసార్లు మలవిసర్జన చేస్తే పక్షవాతం, మూత్రపిండాలు లేదా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. అదే విధంగా ఎక్కువసార్లు మల విసర్జనకు వెళ్లినా ప్రమాదమేనని చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 30 నుంచి 79 ఏళ్ల వయసు గల ఐదు లక్షల మంది ఆరోగ్యవంతుల ప్రేగు కదలికలను 10 ఏళ్ల పాటు ట్రాక్ చేసిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారట. పది ఏళ్లపాటు అంటే పెద్ద విషయమే..! ఫలితాలను మనం నమ్మొచ్చు..!.

అయితే సహజంగా రోజుకు రెండు, మూడు సార్లు మల విసర్జన వెళ్తే.. ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏంట్రా అంటే.. చిన్న చిన్న పనులకే విపరీతమైన అలసటగా ఉండడం. ఒక్కసారిగా బరువు తగ్గడం, నిత్యం కడుపులో నొప్పి లేదా అసౌకర్యంగా ఉండడం. మలంలో రక్తం రావడం లాంటివి కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అలాగే మూడు రోజులు పాటు మలవిసర్జన కాకుంటే..బానే ఉంది కదా అని అస్సలు లైట్‌ తీసుకోకండి. మీ దగ్గర నుంచి మీకే దుర్వాసన వస్తుంది..అలా వచ్చిందంటే..లోపల టాక్సిక్‌ లోడ్‌ ఎక్కువైనట్లే.. మోషన్‌ అవడానికి ఇంటి చిట్కాలో లేక వైద్యులను సంప్రదించి టాబ్లెట్‌ లేదా ఎనీమా లాంటివి చేసుకోవాలి. ప్రతి వ్యక్తి నెలకు ఒకసారి ఎనిమా చేసుకోవడం చాలా మంచిది.. బాడీ లోపల ఉన్న వ్యర్థాలు అన్నీ క్లీన్‌ అవుతాయి.!

Read more RELATED
Recommended to you

Latest news