బీసీసీఐ ఛీప్ గంగూలీ, జైషాలకు భారీ ఊరట లభించింది. మరో మూడేళ్ల పాటు వారి పదవులు పదిలంగా ఉండనున్నాయి. బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా, తమ పదవుల్లోనే కొనసాగనున్నారు. ఈ సెప్టెంబర్ తో వారి పదవి కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడని, ఆ స్థానంలో ఉన్న గంగోలి ఐసిసి అధ్యక్ష రేసులో ఉండబోతున్నాడని పలు ప్రముఖ వెబ్ సైట్ లు కథనాలను ప్రసారం చేశాయి. జైశాకు బీసీసీఐ పట్టం కట్టేందుకు 15 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు సంసిద్ధంగా ఉన్నట్లు సదరు వెబ్ సైట్ లో పేర్కొన్నాయి. మరోవైపు ఐసీసీ చైర్మన్ గా గ్రేగ్ బార్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్ తో ముగియను ఉండడంతో ఆ స్థానంలో గంగూలీని కూర్చోబెట్టేందుకు సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒకవేళ గంగూలీని ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైతే క్రికెట్లో అత్యున్నత పదవి చేపట్టబోయే ఐదవ భారతీయుడిగా రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు.