మన పెద్దలు అంత లేనిదే ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకొని చెప్పరు.. అలాంటి సామెతలలో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెబుతూ ఉంటారు. నిజానికి మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధాలు ఎన్నో ఉల్లిలో ఉన్నాయి.. ఉల్లిపాయ రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. దీనితో ఎన్నో ఉపయోగకరమైన పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉల్లిపాయ మొలకలను ఉల్లికాడలు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మరి కొంతమంది వీటిని ఆనియన్స్ స్ప్రింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వాడలేనివారు ఉల్లిపాయలకు బదులుగా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు.
ఇకపోతే స్ప్రింగ్ యానియన్స్ వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.. స్ప్రింగ్ ఆనియన్స్ ను ఎక్కువగా సూప్స్, బిర్యాని , సలాడ్స్ , కూరలు , ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలలో ఉపయోగిస్తారు.. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరచుగా తినేవారిలో బరువు పెరిగే సమస్య ఉండదు. మలబద్ధక సమస్య కూడా దూరం అవుతుంది.. అంతేకాదు ఉల్లికాడల్లో ఉండే డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచి బరువును తగ్గిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా కాపాడుతుంది. పైల్స్, ఫిస్టులా వంటి సమస్యతో బాధపడే వారు కూడా ఒక చిన్న బౌల్లో కొద్దిగా పెరుగు వేసుకొని అందులో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపి రోజుకు రెండుసార్లు తింటున్నట్లయితే పైల్స్ సమస్య కూడా దూరం అవుతుంది.
ఉల్లికాడల్లోనే సల్ఫర్ అధికంగా ఉంటుంది.. కాబట్టి తరచూ తినేవారిలో కొలెస్ట్రాల్, హై బీపీ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడే వారికి కూడా ఈ ఉల్లికాడల సూపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఉల్లికాడలు సూపు తాగితే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.