కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వీటిని ట్రై చేయండి..!!

-

కిడ్నీలో రాళ్లు పడటం ఈ మధ్య చాలమందిలో ఉంటున్న సమస్య. కిడ్నీ అనేది మనిషి శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అన్నీ అవయవాలు ముఖ్యమే.. అయితే ఏదైనా పాడైతే తిరిగి ఆపరేషన్‌ ద్వారానో, మంచి ఫుడ్‌ ద్వారా వాటిని సెట్‌ చేసుకోవచ్చు.. కానీ కిడ్నీ అలాకాదు. పగిలి అద్దంను ఎలా అయితే అతికించలేమో…పాడైన కిడ్నీని కూడా తిరిగి అదే పొజిషన్‌కు తేలేము. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం పై మనకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కిడ్నీలో రాళ్లతో బాధపడే వారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే ఆ వ్యర్థాలను బయటకు ఈజీగా పంపేయొచ్చు. అవేంటంటే..

తులసి- తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలని శుభ్రపరచి, కిడ్నీలోని రాళ్ళని కరిగేలా చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా మారతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి యూరిన్ ద్వారా బైటికి పోయేలా చేస్తుంది. తులసి నొప్పి నివారిణిగా కూడా పని చేస్తుంది. తులసి టీ తాగడం వల్ల మొత్తం శరీరానికే మేలు జరుగుతుంది.

ఖర్జూరాలు: ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. దీని వల్ల కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా కూడా ఉంటాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. వీటితో పాటూ, కీరదోసకాయ రసం, చెర్రీలు, కొబ్బరి నీరు కూడా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయేలా చేస్తాయి.

పుచ్చకాయ: పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్‌లోని ఎసిడిక్ స్ధాయిని నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసంలో చిటికెడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి సులభంగా చెక్ పెట్టేయొచ్చు.

​లెమన్, ఆలివ్ ఆయిల్ : నిమ్మలో ఉన్న సిట్రేట్ వలన కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు తేలికగా బైటికి వెళ్ళిపోతాయి.

దానిమ్మ రసం- దానిమ్మల్లో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది. ఇందులో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాల వల్ల కిడ్నీల్లో ఉన్న టాక్సిన్స్ బైటికి వెళ్ళిపోతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ : యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్‌లోనూ, యూరిన్ లోనూ ఉన్న యాసిడ్‌ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చేస్తుంది. రోజువారిగా కొద్ది మోతాదులో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరం లోని వ్యర్ధపదార్ధం బైటికి వెళ్లిపోతుంది. అలాగే బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది. అయితే తగిన మోతాదులోనే ఇది వాడాలి.. లాభం ఉంది కదా అని ఎక్కువ వాడితే లేనిపోని సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news