కొబ్బరి నూనె వలన ఎన్ని ప్రయోజానాలో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

కొబ్బరి నూనె లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని లో ఉండే ఔషధ గుణాలు మిమ్మల్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా అందం మరియు ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల చర్మం మరియు జుట్టు సహజంగా, మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్గా మరియు జుట్టుకు కండిషనర్గా కొబ్బరి నూనె ఎంతో మంచి ఎంపిక. కొబ్బరి నూనె లో ఉన్న యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ వల్ల చర్మానికి ఎంతో ఉపయోగం ఉంటుంది.

కొబ్బరి నూనె పొడి చర్మాని కి ఎంతో అవసరం. పొడి చర్మాని కి కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల
చర్మం మృదువుగా మారుతుంది. స్నానం చేయడానికి 20 నిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేసి, మంచి నీటితో స్నానం చేయండి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మరింత మృదువుగా మారుతుంది. కొబ్బరినూనెను మాయిశ్చరైజర్ గానే కాక, పాదాలకు పగుళ్లు వచ్చినప్పుడు కూడా కొబ్బరి నూనె రాసుకోవచ్చు. ఇలా చేస్తే పాదాలు మరింత మృదువుగా మారుతాయి.

అంతే కాదు పెదాలకు కూడా రాసుకోవచ్చు, దాంతో పెదాలు కూడా మృదువుగా కనబడతాయి.
మేకప్ తొలగించడానికి కొబ్బరి నూనె ఎంతో సహాయపడుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎంతో సులువుగా మేకప్ తొలగించవచ్చు. కొద్దిగా కాటన్ తీసుకొని కొబ్బరి నూనెలో ముంచి ముఖం పై ఉన్న మేకప్ ను తీసేయవచ్చు. ఇలా చేస్తే మేకప్ తొలగిపోయి చర్మం మెరుస్తూ కనబడుతుంది.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...