వాతావరణంలో మార్పుల కారణంగా మన శరీరం ఎంతో డ్రై గా మారిపోతూ ఉంటుంది. అయితే కొందరు దీనిని చాలా నెగ్లెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో తెలిసిన చేసే తప్పుల్లో స్కిన్ కి మాయిశ్చరైజ్ వాడక పోవడం మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కిన్ స్మూత్ గా అవడమే కాకుండా, వాతావరణ కాలుష్యం నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అన్న సందిగ్దంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఉంటారు.
అయితే మార్కెట్ నిండా వివిధ రకాల కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఒక్కొక్క ప్రొడక్ట్స్ సూట్ అవుతూ ఉంటాయి. మన స్కిన్ టైప్ ని బట్టి, అవసరాన్ని బట్టి మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో ముఖ్యంగా బాడీ క్రీమ్, బాడీ బటర్, బాడీ లోషన్, బాడీ మిల్క్ వంటి పేర్లతో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయో చూస్తే మనకు ఏమి అవసరమో తెలుస్తుంది.
బాడీ క్రీమ్ లో ఎక్కువ శాతం నీరు, నూనెలు ఉంటాయి. దీనిని నార్మల్ స్కిన్ నుండి డ్రై స్కిన్ వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
బాడీ బట్టర్ లో ఎక్కువశాతం ఆయిల్, హైడ్రేటింగ్ ఇంగ్రిడియంట్స్ ఉంటాయి. అయితే తక్కువ పరిమాణంలో నీరు కూడా ఉంటుంది. రాత్రంతా మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్ తీసుకునే వారు, బాడీబటర్ ఎంచుకోవడం మంచిది.
బాడీ లోషన్ లో ఎక్కువ పరిమాణం నీరు తక్కువ మోతాదులో ఆయిల్స్ ఉంటాయి. మనకి మార్కెట్ లో కూడా ఎక్కువ శాతం బాడీలోషన్ మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. దీనిని ఎటువంటి స్కిన్ టైప్ వారైనా కూడా వాడవచ్చు.
అన్ని మాయిశ్చరైజర్లు కన్నా బాడీ మిల్క్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు బాడీ మిల్క్ ఫ్రీ ఫర్ చేయడం మంచిది. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మన చర్మాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఎక్కువ శాతం నీరు తాగుతూ ఉండడం వల్ల మన చర్మం హైడ్రేషన్ కాకుండా ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ని వాడడం ఎంతో మంచిది.
వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, మన మేకప్ బ్రష్ లను వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.