మీ చర్మం అందంగా ట్యాన్ లేకుండా ఉండాలంటే.. ”జోష్ క్రియేటర్ స్వప్న” చిట్కాలని ట్రై చెయ్యాల్సిందే..!

-

ఈ రోజుల్లో అందమైన చర్మాన్ని పొందడం అంత ఈజీ కాదు. చాలామంది స్కిన్ కి సంబంధించి వివిధ రకాల ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. అయినప్పటికీ అందమైన స్కిన్ పొందలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఒక ఇంటి చిట్కా వందలాది ప్రొడక్ట్స్ తో సమానం పైగా చాలా కంపెనీలు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని అంటూ ఉంటాయి. ఈరోజు ”స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్” అయిన స్వప్న మనతో అద్భుతమైన చిట్కాలని పంచుకున్నారు.

వీటిని కనుక మీరు అనుసరించారంటే అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. స్వప్న హౌస్ వైఫ్. ఈమె చక్కటి చిట్కాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. లైఫ్ స్టైల్, రెసిపీస్, కిచెన్ టిప్స్, బ్యూటీ కేర్, హౌస్ ఆర్గనైజేషన్, షాపింగ్ మొదలైన అంశాలకి సంబంధించిన విషయాలని ఈమె షేర్ చేసుకుంటూ ఉంటారు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మరి ఇప్పుడు ఈమె చెప్పిన స్కిన్ టిప్స్ గురించి కూడా చూసేద్దాం.

ట్యాన్ తొలగిపోయి నిగారింపు కోసం:

దీనికోసం పాలు అవసరమవుతాయి.
రెండు టీ స్పూన్ల మరిగించిన పాలు తీసుకుని ప్రతిరోజు మీ ముఖాన్ని కడిగేసుకుని పాలతో
మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేయడం వల్ల ట్యాన్ తొలగిపోతుంది. స్కిన్ అందం గా కనిపిస్తుంది. స్మూత్ గా ఉంటుంది నిగారింపు కూడా పొందొచ్చు.
అయితే మీరు పాలని తీసుకునేటప్పుడు క్రీం లేని పాలని తీసుకోండి ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే క్రీమ్ ఉన్న పాలని అసలు వాడొద్దు.

రెండవ చిట్కా:

అండర్ ఆర్మ్స్ లో చెమటని తొలగించడం కోసం
దీనికోసం రోజ్, వాటర్ నిమ్మరసం కావాలి.
చాలామందికి అండర్ ఆర్మ్స్ లో చెమట ఎక్కువ పడుతుంది అటువంటి వాళ్ళు ఈ chitka ప్రయత్నం చేయొచ్చు.
కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం వేయండి దీనిని అండర్ అర్మ్స్ పైన అప్లై చేయండి. రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత దుస్తులు ధరించండి ఇలా చేయడం వలన చెమట తొలగిపోతుంది అని జోష్ క్రీయేటర్ స్వప్న చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news