నెరిసిన జుట్టు నల్లబడేందుకు.. ఖర్చు లేని సింపుల్ చిట్కా..!

-

జుట్టు తెల్లబడటం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. గతంలో వయస్సు పైబడితేనే జుట్టు నెరిసేది. కానీ ఇప్పుడు పాఠశాల వయస్సులోనే కొందరి జుట్టు తెల్ల బడుతోంది. వంశపారంపర్యంగా వచ్చే సమస్యలతోపాటు కాలుష్యం, పోషకాహార లోపం ఇందుకు దారి తీస్తున్నాయి.

అయితే నెరిసిన జట్టు ను మళ్లీ నల్లబడాలంటే ఇంటి వైద్యంతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సింది మందార ఆకులు, పూలు. వీటి సాయంతో చాలా జుట్టు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు ప్రకృతి వైద్యులు. జుట్టు చివర్లు నెరవడం, చిట్లడం, వంటి సమస్యలకూ ఈ మందార ఆకులు, మందార పూలతో పరిష్కారం చూపుతాయి.

తెల్లవెంట్రుకలతో బాధపడేవారు గుప్పెడు మందార ఆకులూ, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

ఏడెనిమిది చొప్పున మందార పూలు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి.. కప్పుకొబ్బరి నూనెను వేడి చేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రుళ్లు తలకు రాసుకొని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇక మరో చిట్కా.. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పూలు వేయాలి. కాసేపు మరిగించాలి. చల్లారాక ఆకుల్ని ముద్దలా చేయాలి. కొద్దిగా శనగపిండి కలిపితే షాంపూ తయారు చేసుకోవచ్చు. ఏడెనిమిది మందారపూలను ముద్దలా నూరుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంటయ్యాక తల స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news