పెదవులు నల్లగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎర్రగా మార్చుకోవడానికి కావాల్సిన చిట్కాలు..

ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వల్ల పెదవులు నల్లగా మారుతుంటాయి. దురలవాట్ల వల్ల వాటి సహజ రంగు కోల్పోయి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందంగా కనిపించాలనుకున్నవారికి ఇదొక ప్రతిబంధకంగా అనిపిస్తుంది. అలాంటి వారు కింద చెప్పిన ఇంటి చిట్కాలను పాటిస్తే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా మారతాయి.

బీట్ రూట్

బీట్ రూట్ ని రక్తం ఏర్పర్చే మెషిన్ అని అంటారు. బీట్ రూట్ ముక్కలని తీసుకుని వారానికి రెండు సార్లు పెదాలకి మసాజ్ చేయండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే పెదాల మీద నల్లదనం పోయి వాటి సహజ రంగు వస్తుంది.

నిమ్మ, తేనె

1-2చుక్కల తేనెను 1-2చుక్కల నిమ్మరసంలో కలిపి పెదాలపై ఉంచాలి. పదినిమిషాలయ్యాక పెదాలని నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం రోజుకి రెండుసార్లు, ఉదయం సాయంత్రం చేయాలి.

ఆలివ్ ఆయిల్

పెదాలు పగిలి వాటి సహజ రంగును కోల్పోయి ఇబ్బందిగా అనిపిస్తుంటే ఆలివ్ ఆయిల్ తో మర్దన చేయడం చాలా మంచిది. 4-5రోజులు వరుసగా ఇలా చేయడం వల్ల పెదాల పగుళ్ళు మూసుకుపోయి సహజ రంగుకి వస్తాయి.

బాదం నూనె

బాదం నూనెలో ఉండే పొషకాలు పెదాల సహజ రంగుని బయటకి తీసుకువస్తాయి. బాదం నూనెని తీసుకుని పెదాలకి మర్దన చేయాలి. రాత్రిపూట మర్దన చేసి అలాగే వదిలేయాలి. పొద్దున్న లేవగానే శుభ్రంగా కడిగితే సరిపోతుంది. పెదాలను తేమగా ఉంచడంతో పాటు వాటిని గులాబీ రంగులోకి తీసుకురావడంలో బాదం నూనె బాగా సాయపడుతుంది.