వీపు మీద ఏర్పడ్డ మొటిమలను తొలగించుకునే అద్భుతమైన చిట్కాలు..

-

మొటిమలనేవి ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా ఏర్పదతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో సీబమ్ లేదా నూనె లాంటి పదార్థం ఎక్కువగా స్రవించడం కూడా ఒక కారణం. నిజానికి సీబమ్ ఉత్పత్తి అవడం మంచిదే అయినా మరీ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి నల్లమచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదలా ఉంచితే వీపు మీద ఏర్పడే మొటిమలని ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

వీపు మీద ఏర్పడే మొటిమలకి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దానిలో మరీ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, అధిక చెమట, ఒత్తిడి, చుండ్రు మొదలగు వాటివల్ల వీపు మీద మొటిమలు ఏర్పడతాయి.

మొటిమలని నిరోధించేందుకు చేయాల్సిన పనులు

వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. వర్కౌట్ కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. స్నానం చేయకుండా అలాగే ఉంటే ఇలాంటి మొటిమలు ఏర్పడతాయి.

మరీ బిగుతుగా ఉండే బట్టలని ధరించకూడదు. వేసుకునే బట్టలు ఊపిరి పీల్చుకునేంత వీలుగా ఉండాలి.

మీకు సరికాని చర్మ సంరక్షణ సాధనాలను వాడకూడదు. దానికోసం మీ చర్మం రకం ఏంటో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది.

మీరు వాడే మాయిశ్చరైజర్ లో కొద్ది పాటి టీ ట్రీ ఆయిల్ చుక్కలు వాడండి.

శుభ్రంగా ఉన్న బట్టలనే ధరించండి. రోజువారిగా తప్పకుండా బట్టలను ఉతుక్కోండి.

మీ వీపు మీద మరీ ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా ఉంచుకోండి.

రెగ్యులర్ గా మీ దిండు కవర్లని మార్చుకోండి.

కలబంద రసం, జాజికాయ పొడి, రోజ్ వాటర్, వేప పొడిని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేయండి.

దీన్ని ప్రతిరోజూ వీపు మీద మొటిమలున్న చోట అప్లై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news