మెరిసే చర్మం కోసం నారింజ ఫేస్ ప్యాక్.. ఇంట్లోనే తయారు చేసుకోండి.

-

చర్మ సంరక్షణ కోసం ఆలోచించేవారు ఫేస్ ప్యాక్ ఉపయోగించాలనుకుంటే అందులో నారింజ ఫేస్ ప్యాక్ ( Orange Face Pack ) లను ఖచ్చితంగా చేర్చుకోవాలి. డల్ స్కిన్, మొటిమలు, చర్మం రంగులో మార్పులు మొదలైన వాటిని సరిచేయడంలో ఆరెంజ్ ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. దీని ప్రయోజనాలేంటో? ఎలా చేస్తే మేలు కలుగుతుందో చూద్దాం.

 

orange face pack | నారింజ ఫేస్ ప్యాక్
orange face pack | నారింజ ఫేస్ ప్యాక్

మెరిసే చర్మం కోసం నారింజ రసం

తాజా నారింజ పడు తీసుకోండి. అందులో నుండి రెండు చెంచాల రసాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రసానికి ఒక చెంచా నీటిని కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి వర్తించండి. 10-15నిమిషాల పాటు అలాగే ఉంచుకున్న తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోండి. వారానికి 2-3సార్లు రిపీట్ చేయండి. చర్మం మిలమిల మెరవడానికి ఇది సరైన మార్గం.

మొటిమలు తగ్గడానికి

మొటిమలు చర్మం తళతళ మెరవడానికి నారింజ రసంలో ఒక చెంచా రోజ్ వాటర్ కలుపుకుని, ఆ మిశ్రమాన్ని చర్మానికి వర్తించాలి. ఆ తర్వాత 15నిమిషాలకి ముఖాన్ని శుభ్రపర్చుకుంటే చాలు. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

చర్మ రంగును సరిచేయడానికి

కొందరిలో చర్మం రంగు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా మెడ భాగంలో నలుపు చిరాకు తెప్పిస్తుంది. మెడ భాగం నుండి ముఖం వరకు అంతా ఒకే రకమైన రంగు గల చర్మాన్ని పొందడానికి నారింజ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది.

దీనికోసం నారింజ తొక్కలను తీసుకుని అందులో పాలమీగడ కలిపి, అఅ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను కలపాలి. ఇప్పుడు ఈ మూడింటినీ ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. సిద్ధమైన పేస్టుని మెడ నుండి మొదలుకుని ముఖమంతా రాయాలి. 20నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news