జిడ్డు చర్మం, మొటిమలు.. మొదలగు వాటితో బాధపడేవారు బాదం ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.

-

చర్మ సమస్యలను దూరం చేయడంలో బాదం ప్రాముఖ్యత చాలా ఉంది. ఇందులో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. ముఖం మీద ముడుతలు, గీతలు మొదలగు వాటివల్ల వయసు ఎక్కువగా కనబడుతున్నవారు కూడా బాదం ఉపయోగించవచ్చు. చర్మ సంరక్షణలో బాదం పాత్ర ఈరోజు తెలుసుకుందాం.

పొడిచర్మంతో బాధపడేవారు

1టేబుల్ స్పూన్ బాదం పొడి
1టేబుల్ స్పూన్ ఓట్స్
1టేబుల్ స్పూన్ పచ్చిపాలు

ఈ మూడింటినీ ఒకే దగ్గర కలుపుకుని పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి బాగా వర్తించాలి. అలా 15నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మం తేమగా మారుతుంది. పొడిబారిన చర్మం నుండి విముక్తి పొందుతారు.

జిడ్డు చర్మంతో బాధపడేవారు

చర్మంపై సీబమ్ ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల మొటిమలు, గీతలు ఏర్పడడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి ఈ చిట్కా ఉపయోగించవచ్చు.

1టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి
1టేబుల్ స్పూన్ బాదం పొడి
కొద్దిగా రోజ్ వాటర్

ఈ మూడింటినీ మిక్స్ చేసి పేస్టులాగా తయారు చేసుకుని ముఖానికి వర్తించాలి. 10నిమిషాలు అలాగే ఉంచుకుని, ఆ తర్వాత సబ్బుతో కడిగితే సరిపోతుంది. దీనివల్ల చర్మం జిడ్డుబారడం తగ్గుతుంది.

మొటిమలతో బాధపడేవారు

1టేబుల్ స్పూన్ పెరుగు
1టేబుల్ స్పూన్ బాదం పొడి

ఈ రెండింటినీ బాగా కలిపి పేస్టు సిద్ధం చేసుకుని ముఖానికి వర్తించాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. అలాగే బాదం కారణంగా మొటిమల్లోని బాక్టీరియా నశిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news