పాలపొడితో మెరిసే చర్మం.. ఇలా ఫేస్ ప్యాక్ వేస్తే.. రిజల్ట్ అదుర్స్ ..!

-

పాలపొడితో పాలు తాగుతాం..కానీ ఇది బ్యూటీ టిప్స్ లో కూడా వాడొచ్చు తెలుసా..? పిగ్మెంటేషన్ తగ్గించడానికి పాలపొడి బాగా ఉపయోగపడుతుందట. పాలపొడితో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్ మాంచి గ్లోయింగ్ వచ్చి అదిరిపోతుంది. సౌందర్యపరంగా చూస్తే.. పాలపొడితో బోలేడు లాభాలు ఉన్నాయి. అసలు పాలపొడితో ఎలా ఫేస్ వేసుకోవాలి, ఏ సమస్యలు ఉపయోగపడుతుందో చూద్దాం..!

బొప్పాయిలో పాలపొడిని కలిపితే అది క్లెన్సర్‌లా పనిచేసి చర్మాన్ని క్లీన్ చేస్తుంది. అలాగే చక్కటి మెరుపును సైతం అందిస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ చొప్పున పాలపొడి, బొప్పాయి పండు గుజ్జు తీసుకొని రెండింటినీ కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకోండి. కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచండి. ఆపై చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

పాలపొడిలో చర్మకణాలను పునరుత్తేజితం అయ్యేలా కూడా చేస్తుంది.. దీనికోసం తేనెలో పాలపొడిని కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. ఆపై అరగంట సేపు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మం పొడిబారకుండా ఉంటుంది.

కొన్ని వాల్‌నట్స్ తీసుకొని పొడిచేసుకోవాలి. ఇలా పొడి చేసేటప్పుడు పూర్తిగా మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా పాలపొడి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో కాసేపు చర్మాన్ని మర్దన చేయండి. ఆ తర్వాత అరగంట పాటు ఆరనిచ్చి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

టేబుల్‌స్పూన్ పాల పొడిలో రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమం చేయండి. దీన్ని ముఖం, మెడకు రాసి పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం కడిగేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చర్మఛాయ పెరగడమే కాదు.. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి చర్మంపై ఎక్కువగా ఉండే జిడ్డు కూడా పోతుంది.

పాలపొడి సహజసిద్ధమైన బ్లీచ్‌గా కూడా వాడుకోవచ్చు. ఇది మేనిఛాయను మెరుగుపర్చడమే కాదు.. మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది. దీనికోసం రెండు టీస్పూన్ల పాలపొడిలో నాలుగు టీస్పూన్ల కీరా రసం కలపాలి. ఇందులో కొద్దిగా నిమ్మతొక్కల పొడి వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని పావుగంట పాటు ఆరనిచ్చిన తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే సరి. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికోసారి వేసుకోవడం వల్ల మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు పోతాయి.

చూశారు కదా.. పాలపొడితో ఎన్ని రకాలుగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చో.. మీరు ఓ సారి ట్రై చేసి చూడండి. అయితే ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలోనే కొత్త ప్రయోగాలు చేయడం మంచిది. ఏదైనా ఫంక్షన్స్ కి, ఔటింగ్స్ కు వెళ్లేముందు మనం ఎప్పుడూ ట్రై చేయని ఫేస్ ప్యాక్ తయారుచేసుకోకూడదు. వాటివల్ల రిజల్ట్ ఏదైనా తేడా అయితే..మూడ్ అంతా డిస్టబ్ అవుతుంది. ఇంకొక విషయం.. ఫేస్ ప్యాక్ వేసిన మరుసటి రోజే రిజల్ట్ మనకు కనిపిస్తుంది. కాబట్టి బయటకు వెళ్లాల్సిన ముందురోజు ఏ పేస్ ప్యాక్ అయినా ట్రే చేయమని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news