సామాన్య ప్రజలకు చమురు సంస్థలు మరో ఊహించని షాక్ ఇచ్చింది. 14 కేజీల సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెరిగింది. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ధరలను పెంచుతున్నట్లు.. చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ మాసం నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశాయి.
ఇక తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణ రాష్ట్రంలో సిలిండర్ ధర రూ.1002 కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిలిండర్ల ధర 1008 రూపాయలకు చేరింది. కాగా..వాహనాదారులకు కూడా చమురు సంస్థలు బిగ్ షాక్ ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూయిడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయని చమురు సంస్థలు తెలిపాయి. లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకే రోజు పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంతో… సామాన్యులు మండిపడుతున్నారు.