సాధారణంగా చాలా మంది అందంగా ఉండాలి అనుకుంటారు. చర్మం పై ఎటువంటి ముడతలు పడకుండా యంగ్ గా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ టిప్స్ ని అనుసరిస్తే మంచిది. ప్రతి రోజూ వీటిని అనుసరించడం వల్ల చర్మం అందంగా ఉంటుంది అదే విధంగా ముడతలు లేకుండా ఉంటుంది. అయితే మరి ఆలస్యం ఎందుకు వీటి గురించి ఇప్పుడు చూద్దాం.
ప్రతి రోజూ మంచి నీళ్లు తాగితే మంచిది. దీని వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం కనీసం రోజుకి ఐదు లీటర్ల నీళ్లు తాగితే మంచిదని.. దీని వల్ల ఒంట్లో ఉండే చెడు మలినాలను తొలగిస్తుంది అని అంటున్నారు. అలానే చర్మం పై యాక్ని వంటి సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు.
తేనె కూడా అందానికి బాగా పని చేస్తుందని రెండు నుండి మూడు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ నిమ్మ రసం వేసుకుని దానిలో కొద్దిగా నీళ్లు పోసుకుని తాగితే మంచిది అని చెప్తున్నారు నిపుణులు. దీని వల్ల కూడా ఒంట్లో ఉండే చెడు మలినాలు పూర్తిగా తొలగిపోతాయి.
అలానే ఇది బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది. నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొత్త సెల్స్ ని మరియు చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచుతుంది.
పసుపు కూడా అందానికి బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ పసుపు వేసుకుని తాగితే చర్మం ముడుతలు పడకుండా అందంగా ఉంటుంది.